Virat Kohli(video): ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడే “విరాట్ కోహ్లీ”

Telugu Mirror: భారత రన్ మెషిన్ మాజీ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli). లెజెండ్ టెండూల్కర్(Sachin Tendlukar) తర్వాత ప్రపంచ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న ఈ భారత క్రికెటర్, వాటర్ బాయ్ గా మారినాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే..

ప్రస్తుతం వెస్టిండీస్(Westindies) పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంది. టెస్ట్ మ్యాచ్ లలో అద్భుతమైన ఫామ్ కనబరిచి సర్ డాన్ బ్రాడ్ మన్ (Don Bradman)29 సెంచరీల రికార్డును చేరుకున్న కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డ్ లను తన పేరున లిఖించుకున్నాడు. ప్రస్తుతం జరుగతున్న వన్డే సిరీస్ లో బార్బడోస్ వేదికగా జరిగిన రెండవ వన్డేకు కోహ్లీ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma) కు విశ్రాంతి ఇచ్చిన టీమ్ మేనేజ్ మెంట్ వారి ప్లేస్ లో కొత్త వాళ్ళకు జట్టులో చోటు కల్పించాలని నిర్ణయం తీసుకుందని టాస్ సందర్భంగా స్టాండింగ్ కెప్టెన్ పాండ్య వెల్లడించాడు. అయినప్పటికీ కోహ్లీ మాత్రం ఒక్కసారి గ్రౌండ్ లో దర్శనమిచ్చి అభిమానులను ఆహ్లాదపరిచాడు.

Also Read:TeamIndia Captain : టెస్ట్ కెప్టెన్ గా కోహ్లీ సమర్ధుడే.. కానీ సాధ్యమవుతుందా?

మ్యాచ్ లోని డ్రింక్స్ సమయం లో కోహ్లి డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తినాడు. చాహల్ తో కలసి డ్రింక్స్ బాయ్ గా మారిన కోహ్లీ మైదానం లోని భారత ఆటగాళ్లకు నీళ్ళు, అరటి పండ్లు అందించాడు. ఒక్కసారిగా కోహ్లీ ని డ్రింక్స్ బాయ్ గా చూసిన స్టేడియం లోని అభిమానులు కేరింతలు కొట్టారు. డ్రింక్స్ బాయ్ గా మైదానం లోకి కోహ్లీ వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని చూసిన అభిమానులు కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలి అనేది కోహ్లీ ని చూసి నేర్చకోవాలి అంటూ పలు కామెంట్లు పెడుతున్నారు.

ఇక రెండవ వన్డే మ్యాచ్ విషయానికి వస్తే. భారత జట్టుపై వెస్టిండీస్ 6వికెట్ల తేడాతో గలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ పూర్తి 50 ఓవర్లు కూడా ఆడలేక 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్ మెన్ లలో ఇషాన్ కిషన్ 55 బంతుల్లో 55 పరుగులు 6ఫోర్లు 1సిక్స్ సాయంతో అర్ధసెంచరీ సాధించాడు. శుబ్ మన్ గిల్ 49 బంతుల్లో 5ఫోర్ల సాయంతో 34 పరుగులతో రాణించాడు. వెస్టిండీస్ బౌలర్ లలో రోమారియో షెఫర్డ్ 3/37, గుడకేష్ మోతీ 3/36, అల్జారి జోసెఫ్ 2/35 లు కట్టడిగా బౌలింగ్ చేసి భారత్ ను తక్కువ స్కోర్ కే పరిమితం చేసినారు. అనంతరం 182 పరుగుల స్వల్ప టార్గెట్ ని చేధించేందుకు బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

Leave A Reply

Your email address will not be published.