Telugu Mirror : ప్రతి జీవికి ఆహారం (Food) అనేది చాలా అవసరం. కానీ ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలకు ఆహారం దొరకక అల్లాడిపోతున్నారు. ఈ ప్రపంచ ఆహార దినోత్సవ (World Food Day) సందర్బంగా జీవరాశికి పోషకాహారంపై ఒక అవగాహన పెంచడం కోసం యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని స్థాపించారు. ఈ భూమి పై ఉండే ప్రతి ఒక్కరూ సరైన ఆహారం సరైన పోషణను (Nutrition) పొందాలనే ఈ ప్రపంచ ఆహార దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ప్రతి ఏటా ఎన్నో సంస్థలు ఈ దినోత్సవాన్ని ఎన్నో విధాలుగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read : బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల, సరికొత్త పథకాలను ప్రకటించిన కేసీఆర్
ప్రపంచ ఆహార దినోత్సవం తేథి :
ప్రతి సంవత్సరం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అక్టోబర్ 16 న నిర్వహిస్తారు.
ప్రపంచ ఆహార దినోత్సవం చరిత్ర :
1945వ సంవత్సరం లో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు జీరో హంగర్ (Zero Hunger) లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇక 1979లో FAO సమావేశమై అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవ సెలవు రోజుగా ప్రకటన ఇచ్చారు. ఈ రోజును ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకునేందుకు ప్రపంచంలో దాదాపు 150 దేశాలు అంగీకరించాయి.
ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క ప్రాముఖ్యత :
ప్రజలందరికీ పోషకాహారం కల్పించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ముందుకు వెళ్తోంది. ప్రపంచంలోని నలుమూలల నివసించే వారందరికీ ఆహారం (Food) అందించాలని అందరికీ ఆహార భద్రత కల్పించడమే గాక అందరికీ పోషకాహారం లభించేందుకు అవసరమైన చర్యలను చేపట్టడానికి అనేక అవగాహన కార్యక్రమాలను యునైటెడ్ నేషన్స్ (UN) చేపట్టనుంది. ఈ పరిస్థితిని అధిగమించడమే ప్రపంచ ఆహార దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.
Also Read :World Students Day : అబ్దుల్ కలామ్ జయంతి రోజునే విద్యార్థి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా
ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క లక్ష్యం :
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆహారం వృధా (Wasted) అవుతోంది. వృధా అవుతున్న ఆహారం లక్షలాది మంది ఆకలిని తీర్చవచ్చు. ఇలా వృధా కాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. జానెడు పొట్ట నింపుకోవటానికి కాయకష్టం చేసే కూలీల నుంచి కోట్లు సంపాదిస్తున్న వారు కూడా ఆకలితో ఏ పని చేయలేరు. ఆ కడుపు నింపుకోవటానికి ఎన్నో పాట్లు పడాల్సి వస్తుంటుంది. ఈ ఆకలి సమస్య పేద దేశాల్లోనే కాదు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆకలి కేకలు వినిపిస్తుండటం గమనించాల్సిన విషయం. మనిషే కాదు ప్రతీ జీవిని ఆకలి సమానత్వంతోనే చూస్తుంది. ఆకలికి పేద మరియు ధనిక అనే తేడా లేదు. అటువంటి ఆకలి తీర్చటానికే ఈ ప్రపంచ ఆహార దినోత్సవం కృషి చేస్తుంది. ప్రపంచ ఆకలి తీర్చడమే వరల్డ్ ఫుడ్ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా సరిపడా ఆహారం, సరిపడా నీటి గురించి తగిన అవగాహన తెచ్చుకొని ఈ సమస్యలను పరిష్కరించడానికి అందరూ కలిసి పని చేయాలని ఈరోజు మనకి గుర్తు చేస్తుంది.