Stabbed Telangana Student Dies In US : అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విధ్యార్ధి మృతి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన అమెరికా అధికారులు
అమెరికా లోని ఇండియానా జిమ్‌లో భారతీయ విద్యార్థి వరుణ్ రాజ్ పుచ్చా కత్తిపోట్లకు గురయ్యాడు. తెలంగాణ లోని ఖమ్మం కు చెందిన భారతీయ విద్యార్థి వరుణ్ రాజ్ హాస్పిటల్ లో లైఫ్ సపోర్ట్ పై 9 రోజులు పోరాడి మంగళవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు అమెరికా అధికారులు.
అమెరికాలోని ఇండియానా జిమ్ లో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి వరుణ్ రాజ్ మృతి (died) చెందాడు. ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో MS చదువుతూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్న తెలంగాణలోని ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్ (29) అక్టోబర్ 30న జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో అతడిపై దాడి చేశాడు. ఈ సంఘటనలో వరుణ్ రాజ్ కు తీవ్రగాయాలయ్యాయి.
ఈ క్రూరమైన దాడి విషయమై స్థానికుల సమాచారంతో ఘటనాస్థలి (The scene) కి చేరుకున్న పోలీసులు వరుణ్‌ను ఆస్పత్రికి తరలించారు.. అనంతరం కేసు నమోదు చేసుకుని జోర్డాన్ ఆండ్రేడ్ (24) అనే దుండగుడిని అరెస్టు చేశారు.
అక్టోబర్ 30 నుంచి ఫోర్ట్ వేన్ ఆసుపత్రిలో లైఫ్ సపోర్ట్ పై చికిత్స పొందుతున్న వరుణ్‌రాజ్ తొమ్మిది రోజుల పాటు విషమ పరిస్థితులలో ప్రాణాల కోసం పోరాడి చివరకు మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు అమెరికా అధికారులు వరుణ్ రాజ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వరుణ్‌రాజ్ మృతి వార్తతో అతడి కుటుంబం తీవ్ర విషాదం (A terrible tragedy) లో మునిగిపోయింది. వరుణ్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకు వచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read : Sudipta Mohanty: ఛీ.. ఛీ..ఇదేం డాక్టర్..ఇండో అమెరికన్ డాక్టర్ ని అరెస్ట్ చేసిన FBI
ఇదిలాఉండగా.. భారతీయ విధ్యార్ధి వరుణ్ రాజ్ పై ఇండియానాలో దాడి జరిగిన మూడు రోజుల తర్వాత ఈ ఘటనపై అమెరికా యంత్రాంగం విచారం వ్యక్తం చేసింది. అలాగే వరుణ్ రాజ్ పుచ్చా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటూ, US స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ పరిస్థితి గురించి సందేహాల కోసం స్థానిక చట్టాన్ని అమలు చేయడానికి వాయిదా వేసింది.
భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థి వరుణ్ రాజ్ పుచ్చపై జరిగిన భయంకరమైన దాడి (A terrible attack) యొక్క నివేదికలు మమ్మల్ని తీవ్రంగా కలచివేశాయి. అతను గాయాల నుంచి పూర్తిగా కోలుకోవాలి. స్థానిక చట్టాన్ని అమలు చేసేవారు ఈ విషయానికి సంబంధించిన విచారణలకు సమాధానం ఇవ్వాలి. ఈ కేసుకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే స్థానిక చట్టాన్ని వాయిదావేస్తాము అని US స్టేట్ డిపార్ట్ మెంట్ అధికారి పేర్కొన్నారని ANIనివేదించింది.
అయితే మృత్యువుతో పోరాడుతూ వరుణ్ రాజ్ మంగళవారం మృతిచెందాడనే వార్త కుటుంబ సభ్యులతో పాటు ఖమ్మం మామిళ్ల గూడెం ప్రాంతంలో విషాదాన్ని నింపింది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Comments are closed.