Scam by Instagram : ఇన్స్టాగ్రామ్ యాడ్ నమ్మి రూ.10 లక్షలు కోల్పోయిన యువతి, మోసగాళ్ల నుండి రక్షణ పొందండిలా
Telugu Mirror : ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళ అందరి దగ్గర ఇన్స్టాగ్రామ్ యాప్(Instagram App) కూడా కచ్చితంగా ఉంటుంది. యూజర్స్ కి ఇంస్టాగ్రామ్ విడదీయలేని బంధం గా మారింది. మంగుళూరు లో జరిగిన సంఘటన ఈరోజు మీకు చెప్పబోతున్నాం. మంగుళూరులో ఓ సాఫ్ట్ వెర్ ఉద్యోగిని ఇంస్టాగ్రామ్ యాప్ లో పార్ట్ టైం జాబ్(Part Time Job) ఇప్పిస్తామని వచ్చిన యాడ్ ని నమ్మి 10 లక్షల రూపాయలను కోల్పోయింది. జరిగిన ఈ స్కాం లో కొంత డబ్బు పెట్టుబడి పెడితే అధిక లాభాన్ని పొందుతారు అని చెప్పి ఆమెను ఒక తప్పుడు దారి పట్టించి మోసానికి గురి చేసారు.
ఆ బాధితురాలు అధిక రాబడిని పొందాలని ఆశ పడి , ఇన్స్టాగ్రామ్ యాడ్ లో ఎక్కువ లాభాన్ని అందరిస్తామనే ప్రకటన ఆమెను ఆకట్టుకుంది . వాళ్ళు పెట్టిన వాట్సాప్ నెంబర్(9899183689) కు స్పందించి తను కూడా ఉత్సాహముగా ఉన్నట్టు సందేశాన్ని పంపించించి. @khannika9912 హ్యాండిల్ ని వినియోగించి టెలిగ్రామ్ లో ఒక వ్యక్తిగా కనెక్ట్ అవ్వమని చెప్పారు. టెలిగ్రామ్ ని ఉపయోగించి ఆదాయానికి 30 శాతం డిస్కౌంట్ ఇచ్చినట్టు ఇచ్చి స్క్యామర్(Scammer) ఆ భాదితుని ఖాతాలో రూ . 9100 రూపాయలు వేశారు . ఆ బాధితురాలు వారిని పూర్తిగా నమ్మింది ఆ తర్వాత అదే UPI ID కి రూ . 7000 పంపించింది.
Photographer Dance Video Viral : బంధువులతో కలిసి చిందులు వేసిన ఫోటోగ్రాఫర్, వీడియో చూస్తే ఫిదానే
ఆమె అకౌంట్ లోకి డబ్బు రాగానే ఇంకా వారి పై నమ్మకం పెరిగింది. ఆ విధంగా పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టేందుకు ఆమెను ఒప్పించడం గెలిచాడు. ఈ సారి రూ. 20,000 అదే UPI ID కి డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే ఆమె ఖాతా బ్లాక్(Block) అయినట్టు వచ్చింది. ఇంకా తన అకౌంట్ కి ఆ డబ్బు డిపోసిట్ కాలేదు. ఇది ఇలా జరిగిన తర్వాత కూడా ఆ బాధితురాలు అదే UPI ID కి మరల రూ. 10,50,525 నగదుని ట్రాన్ఫర్ చేసింది. అప్పుడు తాను మోసపోయానన్న విషయాన్ని గమనించి పోలీసులకు పిర్యాదు చేసింది.
స్కామ్ ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఇప్పుడు మేం చెప్పబోయే భద్రతా చర్యలు తెలుసుకొని ఈ చర్యలను అనుసరించి స్కామ్ ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
నమ్మదగిన ప్లేట్ ఫామ్ లను ఎంచుకోండి..
లింక్డ్ ఇన్ , నౌకి.కామ్, ఇండీడ్ లాంటి యాప్ లను స్వల్ప కాల ఉద్యోగం కోసం ఎంచుకోండి. ఇందులో జాబ్ అవకాశాలకు ప్రయత్నించండి. ఈ యాప్ లను ప్రియతముగా మార్చుకోండి. అందువల్ల మీరు మోసపోయే అవకాశం ఉండదు.
వనరులను పరిశీలించడం..
జాబ్ కొరకు వేరే మూలాలను వెతికే ప్రయత్నం చేయండి.ఎవరైతే మీకు ఉద్యగం ఇస్తారో ఆ వ్యక్తిని మరియు వారి కంపెనీ ని పరిగణలోకి తీసుకొని క్షుణ్నంగా పరిశీలించాలి. తొందరగా ఆన్లైన్ లో పరిధోదించడం ద్వారా చట్టబద్దంగా అవకాశాలు పొందడంలో దోహదపడుతుంది.
వ్యక్తిగత సమాచార విషయం లో జాగ్రత్త వహించండి..
మీ వ్యక్తిగత సమాచారమును అనగా మీ పేరు , మీ ఫోన్ నెంబర్ ఇతరులతో పంచుకునేప్పుడు జాగ్రత్త వహించాలి. నమ్మదగిన ప్లాట్ ఫామ్ లలో మాత్రమే మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వండి.
డబ్బు చెల్లించే విషయం లో జాగ్రత్త వహించడం..
మొదటగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు ఉద్యోగం రావడం కోసం మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. తెలియని వ్యక్తులకు పరిచయం లేని వారికి డబ్బు ట్రాన్ఫర్ చేయడం వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది.