Digilocker : డిజిటల్ ప్రపంచంలోకి దూసుకెళ్తున్న YSJ ప్రభుత్వం.. డిజిలాకర్ లో డ్రైవింగ్ లైసెన్స్ అప్డేట్ చేసుకోండి మరి
Telugu Mirror : ఒక ముఖ్యమైన పరిణామం దిశగా అడుగులేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ డిజిటల్ యుగాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. పేపర్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్(Driving license)లు అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లకు తిలోదకాలు పలికింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనలతో, పర్యావరణ స్పృహ ను కూడా కలిగి ఉండి రవాణా శాఖ లోని పనులను సాంకేతికం(Technology)గా మరింత సులభంగా వినియోగించడమే లక్ష్యంగా పెట్టుున్నట్లు తెలిపింది.
Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్ లో SIP విధానం ..రోజుకి రూ.100 పెట్టుబడి తో కోటీ మీ సొంతం
AP రవాణా శాఖ(Transport Department)ఇక మీదట ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కాగితాలపై ముద్రించి ఇవ్వదు. వాటికి బదులుగా, రవాణా శాఖ ఈ పత్రాల యొక్క డిజిటల్ వెర్షన్(Digital Version)లను ఫోర్స్ లో ఉంచుతారు, పత్రాల డిజిటల్ వెర్షన్ ను డిజిలాకర్ లేదా ఎం-పరివాహన్ వంటి మొబైల్ యాప్‌ల ద్వారా పొందవచ్చు.కొత్త డిజిటల్ కార్డ్‌ల వలన ఖచ్చితంగా బహుళ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అవి పూర్తిగా ఉచితం(Free) గా అందజేయనున్నారు. గతంలో చెల్లించాల్సిన దరఖాస్తు రుసుము రూ.200 అలాగే, రూ.35 పోస్టల్ ఛార్జీలు రద్దు చేసినారు.
పౌరులు వారి డిజిటల్ డాక్యుమెంట్‌లను వారికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఇబ్బంది లేకుండాపొంద వచ్చు.పౌరులందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం భరోసాని ఇస్తుంది. స్వంత మొబైల్ ఫోన్(Mobile Phone)లు లేని వారు ఏ విధమైన ఇబ్బంది లేకుండా తమ డిజిటల్ కార్డ్‌ల అదేరకమైన ముద్రణలను తీసుకోవచ్చు, దీని వలన ప్రతి ఒక్కరూ చట్టానికి అనుగుణంగా నిబంధనలను అనుసరించడానికి వీలుంటుంది. డ్రైవింగ్ లైసెన్స్‌లు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల డిజిటల్ వెర్షన్‌లను వాహనాల తనిఖీల సమయంలో ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) మరియు సంబంధిత అధికారులు పూర్తిగా గుర్తిస్తారని రవాణా కమిషనర్ ఎంకే సిన్హా పేర్కొన్నారు.ఈ విధానము సులభతరంగా ఉంటుంది. అలాగే పత్రాలను వెంట తీసుకెళ్లవలసిన అవసరాన్ని తొలగిస్తుంది.
MakeUp Tips : మేకప్ తో రెట్టింపు సౌందర్యం మీ సొంతం.. మరి జాగ్రత్తలు తీసుకోకపోతే తర్జనభర్జనే
డిజిటలైజేషన్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతోంది. ఈ చొరవ కాగితం వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పచ్చగా మారుస్తుంది.డ్రైవర్లు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ హోల్డర్లు(Holders) భయపడాల్సిన అవసరం లేదు. రవాణా శాఖ ఈ దరఖాస్తుదారులకు వారి కార్డులను మెయిల్(Mail) చేస్తుంది.ఈ డిజిటల్ పరివర్తన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సేవలను మెరుగుపరుస్తుంది. కాగిత రహితంగా మార్చాలనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక పౌరులకు మరియు పర్యావరణానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల పట్ల ప్రభుత్వ అంకితభావాన్ని చూపుతుంది.