Telugu Mirror : క్లాడియా గోల్డిన్ (Claudia Goldin) ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఈమె అమెరికాకు చెందిన ఆర్ధికవేత్త మరియు హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్. క్లాడియా గోల్డిన్ ఆర్థిక శాస్త్రంలో (Economics) నోబెల్ బహుమతిని గెలుచుకున్న మూడవ మహిళగా నిలిచారు. స్వీడన్ సెంట్రల్ బ్యాంక్, 1968లో జనాధారణ పొందిన ఎకనామిక్స్ అవార్డును ప్రారంభించింది 2023లో క్లాడియా గోల్డిన్ , జాబ్ మార్కెట్‌లో మహిళలు ఎలా పని చేస్తారనే దాని గురించి మాకు అందించిన సహకారం వల్ల ఈ నోబెల్ బహుమతిని అందుకున్నారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ హాన్స్ ఎల్లెజెన్ వెల్లడించారు. 2009లో ఎలినార్ ఓస్ట్రోమ్ మరియు 2019లో ఎస్తేర్ డుఫ్లో నోబెల్ బహుమతిని అందుకోగా ఇప్పుడు క్లాడియా గోల్డిన్ మూడో మహిళగా నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
క్లాడియా గోల్డిన్ గురించి తెలుసుకుందాం.
క్లాడియా గోల్డిన్ 1946లో న్యూయార్క్ నగరంలో జన్మించారు. షికాగో యూనివర్సిటీ లో పీహెచ్డీ (PHD) చేసి పట్టా పొందారు. 1989 నుండి 2017 వరకు, ఆమె NBER యొక్క “ది డెవలప్‌మెంట్ ఆఫ్ ది అమెరికన్ ఎకానమీ ప్రోగ్రామ్‌కు” డైరెక్టర్ గా పని చేసారు. ఆ తర్వాత, ఆమె ఎకానమీ గ్రూప్‌లో NBER యొక్క జెండర్ కి కో-డైరెక్టర్‌గా ఉన్నారు. U.S. వ్యాపారంలో మహిళల పాత్రల గురించి ఆమె లోతైన అధ్యయనాలను చేసింది. దాని ఫలితంగా ఎన్నో ప్రశంసలు పొందింది.
Also Read :స్వర్ణ సింహాసనం అంటే ఏమిటీ మరియు మైసూర్ దసరా పండుగకు దాని ప్రాముఖ్యత ఏంటి
క్లాడియా గోల్డిన్ చేసిన పని గురించి తెలుసుకుందాం.
హార్వర్డ్ లోని ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయిన క్లాడియా గోల్డిన్, స్త్రీ పురుషుల మధ్య వేతన వ్యత్యాసాలపై చేసిన పరిశోధనలకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. జాబ్ మార్కెట్‌లో వేతనాలు ఎందుకు సరిగ్గా ఉండవు అనే దానికి గల కారణాలను ఆమె చెప్పారు. క్లాడియా గోల్డిన్ 1990లో హార్వర్డ్ ఎకనామిక్స్ విభాగంలో పనిచేసిన మొదటి మహిళగా నియమితులయ్యారు. 1990లో ఆమె “అండర్ స్టాండింగ్ ది జెండర్ గ్యాప్ యాన్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ అమెరికన్ ఉమెన్” అనే పుస్తకాన్ని రాసారు. ఇది గత 200 సంవత్సరాలలో వేతన అసమానతలకు గల కారణాలను వివరిస్తుంది .
మహిళలు మరియు గర్భనిరోధక మాత్రలపై క్లాడియా గోల్డిన్ ఏం చెప్పింది .
క్లాడియా గోల్డిన్ గర్భనిరోధక మాత్రలపై (Contraceptive Pill) ఎక్కువగా పని చేసారు ఇది కెరీర్ మరియు వివాహం గురించి మహిళల ఎంపికలను ప్రభావితం చేస్తుంది. పెళ్లి తర్వాత మహిళల ఇంటిపేర్లు ఎలా మారడం మరియు మహిళలు ప్రధానంగా అండర్ గ్రాడ్యుయేట్ కావడానికి కారణం గురించి ఆమె మరింత పరిశోధన చేసింది. ఇక ఇది ఇలా ఉండగా, సాహిత్య, భౌతిక, వైద్య, రసాయన శాస్త్ర మరియి శాంతి విభాగాల్లో నోబెల్ బహుమతులను ప్రకటించారు. ఆర్థిక శాస్త్ర విభాగంలో డగ్లస్ డబ్లు డైమండ్, ఫిలిప్ హెచ్, డైబ్‌విగ్ మరియు బెన్ షాలోమ్ బెర్నాంకే నోబెల్ బహుమతులను గతేడాది అందుకున్నారు. వీరికి బ్యాంకులు మరియు ఆర్థిక సంక్షోభంపై చేసిన కృషికి ఫలితంగా నోబెల్ బహుమతులను గెలుచుకున్నారు. క్లాడియా గోల్డిన్ కి డిసెంబర్ లో ఓస్లో స్టాక్‌హోమ్‌లో ఈ నోబెల్ బహుమతిని సమర్పించడం జరుగుతుంది.
Also Read : స్విగ్గీ నుంచి సరసమైన వన్ లైట్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్, ఉచిత డెలివరీలు మరియు తగ్గింపులతో పాటు మరెన్నో