Nokia Smartphones : ఫీచర్ ఫోన్‌ల కాలంలో నోకియా బ్రాండ్ అంటే ఫుల్ క్రేజ్ ఉండేది.ఇక ఎప్పుడైతే స్మార్ట్‌ఫోన్‌ల కాలం వచ్చిందో ఆ కంపెనీ ఫోన్‌లు దాదాపు కనుమరుగయ్యాయి. ఆ తర్వాత నోకియా ఫోన్ల తయారీకి లైసెన్స్ పొందిన హెచ్‌ఎండీ (హ్యూమన్ మేడ్ డివైస్) కంపెనీ… ఇప్పటి వరకు నోకియా బ్రాండ్‌తో ఫీచర్ ఫోన్‌లు, స్మార్ట్ ఫోన్‌లను తీసుకొచ్చింది. ఇప్పుడు HMD తన సొంత బ్రాండ్‌తో భారతదేశంలో తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.
భారత మార్కెట్లోకి తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో లభ్యమవుతున్న ఈ ఫోన్ ‘HMD Arrow’ పేరుతో ఇక్కడ పరిచయం కానుంది. ఇది ఇప్పటికే ‘హెచ్‌ఎండీ ప్లస్’ పేరుతో యూరోపియన్ మార్కెట్లలో విడుదలైంది.
నివేదికల ప్రకారం, ‘HMD యారో’ స్మార్ట్‌ఫోన్ జూలై 25న భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, విడుదల తేదీపై కంపెనీ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌కు పేరు పెట్టడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోటీ కూడా జరిగింది.
ధర రూ. 12,460…
యూరోపియన్ మార్కెట్లలో ఈ HMD స్మార్ట్ ఫోన్ ధర దాదాపు రూ.12,460 ఉంది. ఇదే ధరలో భారత మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అట్మాస్ బ్లూ, డ్రీమీ పింక్, మెటియోర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంది. 6.65-అంగుళాల HD+ LCD స్క్రీన్, గరిష్టంగా 600 nits వరకు బ్రైట్‌నెస్, 8GB RAM, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, Unisock చిప్‌సెట్ ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లు.
మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 256GB వరకు విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. 10W USB టైప్-C ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ, 13MP బ్యాక్ కెమెరా మరియు 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 5G నెట్‌వర్క్‌ను కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది.