ఢిల్లీ లోని రాం లీలా మైదాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. దాదాపు అన్ని రాష్ట్రాలకు సంభంధించిన ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగులు పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలివచ్చి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మూవిమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ ఎమ్ ఓ పి ఎస్) బ్యానర్ క్రింద ఈ పెన్షన్ శంఖనాధ్ మహా ర్యాలీని నిర్వహించారు.
నూతన పెన్షన్ పధకాన్ని 2004 వ సంవత్సరంలో అమలు చేయబడింది. ఈ పెన్షన్ కు సంభంధించి కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వివాదం (dispute) చెలరేగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కేంద్ర బిందువైన NPS (National Pension System) అంటే జాతీయ పెన్షన్ విధానం అలాగే OPS అంటే పాత పెన్షన్ విధానం రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని (difference) మరియు OPS అమలు చేస్తే ప్రభుత్వం పై పడే ఆర్ధిక భారాల గురించి తెలుసుకుందాం.
పాత పెన్షన్ స్కీమ్ ను ఈ విధంగా అర్థం చేసుకోండి:
పాత పెన్షన్ స్కీమ్ (OPS) కింద, రిటైర్డ్ ఉద్యోగి తప్పనిసరి పెన్షన్ హక్కును పొందుతారు. ఇది ఉద్యోగి పదవీ విరమణ (retirement) సమయంలో పొందే ప్రాథమిక వేతనంలో 50 శాతం. అంటే, ఉద్యోగి ఉద్యోగం పూర్తి చేసుకుని పదవీ విరమణ చేసేప్పటి మూల వేతనంలో అతనికి పెన్షన్ ఇస్తారు. పాత పెన్షన్ స్కీమ్, పదవీ విరమణ తర్వాత, ఉద్యోగి డియర్ నెస్ అలవెన్స్ (D.A) మరియు పని చేసే ఉద్యోగికి ఉండే ఇతర అలవెన్సుల ప్రయోజనాన్ని పొందుతూనే ఉంటాడు, అంటే ప్రభుత్వం ఏదైనా అలవెన్స్ భత్యాన్ని పెంచినట్లయితే, దానికి అనుగుణంగా పెన్షన్ కూడా పెరుగుతుంది.
నూతన పెన్షన్ స్కీమ్ కు OPS కి ఎంత తేడా ఉంది?
నూతన పెన్షన్ విధానం 2004 సంవత్సరంలో అమలు చేయబడింది. కొత్త పెన్షన్ పరిధిలో 2004 తరువాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. OPS (Old Pension Scheme) మరియు NPS పథకాల మధ్య చాలా తేడా ఉన్నప్పటికీ, అతిపెద్ద వ్యత్యాసం ఏమిటంటే, OPS కింద, పెన్షన్ మొత్తం ప్రభుత్వ ఖజానా (Treasury) నుండి చెల్లించబడుతుంది మరియు ఈ పథకంలో పెన్షన్ కోసం ఉద్యోగుల జీతం నుండి డబ్బును మినహాయించాలనే నిబంధన లేదు. అదే సమయంలో, NPS పరిధిలోకి వచ్చే ఉద్యోగుల జీతం నుండి 10 శాతం డబ్బు మినహాయించబడుతుంది.
Also Read : డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డ్ లు జారీ చేసే నిబంధనలలో మార్పులు. అక్టోబర్ 1 నుండి అమలులోకి
కొత్త పెన్షన్ స్కీమ్ లో జిపిఎఫ్ సౌకర్యం లేదు, అయితే పాత పెన్షన్ విధానంలో ఉద్యోగులకు జిపిఎఫ్ సౌకర్యం అందుబాటులో ఉంది. స్టాక్ మార్కెట్ ఆధారంగా కొత్త పెన్షన్ విధానం రూపొందించబడింది, కాబట్టి కొత్త పెన్షన్ పద్దతిలో దీర్ఘకాలం (long term) లో మెరుగైన రాబడిని పొందే అవకాశం ఉంది, అయితే, తక్కువ రాబడి విషయంలో ఫండ్ నష్టపోయే అవకాశం ఉంది.
Also Read : 7th Pay Comission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు, త్వరలో డీఏ, డీఆర్ పెంపు
ప్రభుత్వ ఖజానా పై భారం లెక్క:
పాత పెన్షన్ పథకం (OPS) ప్రభుత్వ ఖజానాపై భారాన్ని అధికం చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత సెప్టెంబర్ నెలలో ఒక నివేదికను విడుదల చేసింది, అందులో ఖజానా పైన పడే భారం గురించి గణాంకాలతో సహా సమాచారం పొందుపరచింది. నివేదిక ప్రకారం, పాత పెన్షన్ పథకం అమలు పరచాలంటే ఆర్థిక వనరులు మరింత ఒత్తిడి (stress) ని కలిగిస్తుంది ఇది రాష్ట్రాల పొదుపు మీద ప్రభావం చూపెడుతుంది.
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం:
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చేసిన అధ్యయన నివేదికలో, పాత పెన్షన్ స్కీమ్ ను తీసుకున్న తర్వాత, కొత్త పెన్షన్ పథకం కింద అంచనా వేసిన పెన్షన్ వ్యయం కంటే దాదాపు 4.5 రెట్లు పెన్షన్ పైన వ్యయం అధికమవుతుందని చెప్పబడింది.. పాత పెన్షన్ పధకం కారణంగా ప్రభుత్వ ఖజానాపై భారం కూడా 2060 నాటికి జిడిపిలో 0.9 శాతానికి పెరగవచ్చు. సెంట్రల్ బ్యాంక్ ప్రకారం, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేస్తుంది మరియు ఆ రాష్ట్రాలు ఆర్ధికంగా మరింత దిగజారవచ్చు.