Telugu Mirror : దేంట్లో అయిన అధిక వినియోగం అంత మంచిది కాదని మన అందరికీ తెలుసు. బ్లాక్ కాఫీ(Black coffee) కూడా అతిగా తాగడం వల్ల చాలా ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.అది మీ నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. దాని వినియోగాన్ని పరిమితం చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నిద్రలేవడానికి మరియు మేల్కొనడానికి మీకు బ్లాక్ కాఫీ మాత్రమే అవసరమా? ఇది మీ మానసిక స్థితిని పెంచడానికి సరైన మార్నింగ్ డ్రింక్ లాగా అనిపించవచ్చు, కానీ ఇది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది అనే విషయం మీరు గమనించాలి. చలనచిత్రాల్లో మరియు వెబ్ సిరీస్‌లలో నిద్రలేవగానే బ్లాక్ కాఫీ తాగడం ఇక రోజుకు సిద్ధం కావడం వంటివి చూస్తూనే ఉంటాం. కానీ దాన్ని పోషకాహార నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యానికి ఎలా హాని చేస్తుందో, చెన్నై, తమిళనాడులోని క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ న్యూట్రిషనిస్ట్ హరిప్రియ ఎన్‌ని ఏం చెప్పారో తెలుసుకుందాం.
Also Read : బీట్‌రూట్‌తో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు, అవేంటో తెలుసా ?
ఆమె ఇలా పేర్కొన్నారు, బ్లాక్ కాఫీ అనేది కాల్చిన కాఫీ గింజల నుండి తయారైన ఒక ఇష్టమైన మరియు వ్యసనపరమైన పానీయం. దీన్ని ప్రాసెస్ చేసే సమయంలో రుచి, రంగు, కెఫిన్ మరియు పోషకాలను విడుదల చేస్తుంది. బ్లాక్ కాఫీ కాస్త చేదుగా ఉంటుంది మరియు దీన్ని వేడిగా లేదా చల్లగా తాగడానికి ఉపయోగిస్తారు.
బ్లాక్ కాఫీ నిద్రపై ప్రభావం చూపుతుంది.
మీరు రాత్రి వేళ పనిలో మెలకువగా ఉండటానికి లేదా రాత్రి సమయంలో చదువుకోవడానికి బ్లాక్ కాఫీ తీసుకుంటే, అది మీ దినచర్యలో మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. డైటీషియన్ (Dietitian) ప్రకారం, ఇది మీ సెరోటోనిన్ స్లీప్ హార్మోన్‌కు (Serotonin sleep hormone) అంతరాయం కలిగిస్తుంది. నిద్రపోవడానికి మరియు కాఫీ తాగడానికి మధ్య కనీసం 8 గంటలు విరామం తీసుకోవాలని నిపుణులు సలహా ఇచ్చారు. ఇలా ఉంటే ఆ పానీయం నిద్రకు భంగం కలిగించకుండా చేస్తుంది.
బ్లాక్ కాఫీ తలనొప్పి, నెర్వస్‌నెస్‌ని కలిగిస్తుంది.
పెద్దలు ప్రతిరోజూ 400mg కంటే ఎక్కువ కెఫిన్ (4 కప్పులు) తీసుకోకూడదని అని నిపుణులు చెబుతున్నారు. పాలిచ్చే మరియు గర్భిణీ స్త్రీలు రోజుకు 200-300mg వరకు మాత్రమే కెఫిన్ తీసుకోవాలి. బ్లాక్ కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్రలేమి, తలనొప్పి, చిరాకు, వేగంగా గుండె కొట్టుకోవడం మొదలైన సమస్యలు తలెత్తుతాయని డైటీషియన్ హెచ్చరిస్తున్నారు.
Also Read : జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ సూపర్ ఫుడ్స్ ని తీసుకోండి
బ్లాక్ కాఫీ వల్ల ఎసిడిటీ పెరుగుతుంది.
ప్రేగు పూత, అజీర్తి, యాసిడ్ రిఫ్లక్స్, పొట్టలో పుండ్లు మరియు ఐబిఎస్ సమస్యలతో బాధపడుతున్న వారు బ్లాక్ కాఫీ తాగకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది మీ అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది మరియు ఆరోగ్యకరమైన జీవనానికి ఆటంకం కలిగిస్తుంది.
యాంటీ న్యూట్రీషియన్.
విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉండే పండ్లు వంటివి భోజనంతో పాటు తీసుకున్నప్పటికీ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఆ విటమిన్లు, ఖనిజాలు మీ శరీరానికి అందించకుండా చేస్తుంది. ఇది కాల్షియం మరియు ఐరన్ కూడా మీ శరీరానికి అందించకుండా చేస్తుంది. మీరు బ్లాక్ కాఫీ ని తాగడం కొనసాగించినట్లయితే, మీరు పోషకాలు మరియు ఖనిజాల లోపాలను ఎదురుకుంటారు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…