Telugu Mirror: వర్షాకాలంలో వానలు కురవడం సాధారణం వర్షం పడుతున్నప్పుడు వర్షాన్ని ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. వర్షం పడే సమయంలో ఏదైనా వేడివేడిగా తింటూ మరియు తాగుతూఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వర్షం పడేటప్పుడు ఎక్కువగా వండేది మరియు తినేది పకోడీ(pakodi), బజ్జి(bajji) మొదలైనవి ఇష్టంగా తింటారు.
అయితే వీటిని ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. నూనెలో వేయించిన పదార్థాలు ప్రతిసారి తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎక్కువగా డీప్ ఫ్రై ఫుడ్(Deep fry food) తినడం వలన బరువు పెరగడం, కొలెస్ట్రాల్(cholesterol) వంటి సమస్యలు మొదలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఇప్పుడు మీరు అలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన పకోడీలను నూనె లేకుండా ఎలా చేయాలో చెబుతున్నాం. ఈ ఆయిల్ ఫ్రీ పకోడీ(oil free pakodi)లు రుచితో పాటు ఆరోగ్యం కూడ. ఈరోజు మేము మీకు అతి తక్కువ నూనెతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పకోడీలు ఎలా తయారు చేయాలో చెప్తున్నాం. మేము చెప్పే టిప్స్ పాటించి నూనె లేకుండా స్పైసి పకోడీలను తయారు చేద్దాం. వీటిని తయారు చేయడానికి మూడు రకాల పద్ధతులు ఉపయోగించవచ్చు. ఈ మూడింటిలో కూడా చాలా తక్కువ నూనెను వాడుతాము. ఇలా చేయడం వల్ల ఆరోగ్యకరమైన ఇబ్బందులు కూడా రావు.
పకోడికి కావలసిన పదార్థాలు: శనగపిండి ,ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఫ్రెష్ కొత్తిమీర, చిటికెడు పసుపు, ఆఫ్ టీ స్పూన్- నూనె, బేకింగ్ పౌడర్, రుచికి సరిపడా- ఉప్పు.
తయారీ విధానం లో మొదటి పద్దతి:
ఉల్లిపాయలను సన్నగా తరగాలి. దీనిలో శెనగపిండి, ఉప్పు , పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ నూనె, సాల్ట్ అన్ని వేసి పిండిని కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు పాన్ లో పకోడీ మునిగే వరకు నీళ్లు పోసి మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు చేతితో పిండిని తీసుకొని పకోడీ లను ఒక్కొక్కటీ మరుగుతున్న నీళ్లలోవేయాలి. పకోడీలు నీళ్లలో వేసినప్పుడు పకోడీ మునగాలి. పకోడీలు రంగు మారేవరకు రెండు వైపులా ఉడికించాలి. రెండు వైపులా కాలిన తర్వాత తీసి పైన కొద్దిగా చాట్ మసాలా చల్లుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేయండి.
రెండవ పద్ధతి: పకోడీలకు పిండిని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. మామూలు పాన్ కాకుండా నాన్ స్టిక్ పాన్ లో వండటం వల్ల నూనె తక్కువగా అవసరం పడుతుంది. అందుకే పకోడీలు చేయాలనుకున్నప్పుడు నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నూనె వేసి పాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. నూనె వేడయ్యాక పకోడీలు వేయాలి. చిన్న మంట మీద రంగు మారేవరకు రెండు వైపులా కాల్చాలి.
మూడవ పద్ధతి: పకోడీలకు పిండిని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు అప్పాలు చేసే మేకర్ ను తీసుకోండి. మేకర్ లో ఉన్న అన్ని మౌల్డ్స్ కి కొంచెం నూనె లేదా నెయ్యితో గ్రీస్ చేయాలి. ప్రతి అచ్చులో కొద్దిగా పకోడీ పిండిని వేయాలి. చిన్న మంట మీద కలర్ మారేవరకు ఉంచాలి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. అతి తక్కువ నూనెతో తయారైన పకోడీలు రెడీ.
కాబట్టి ఎప్పుడూ ఆయిల్ లోనే డీప్ ఫ్రై చేసే పకోడీలు కాకుండా ఈసారి కొత్తగా ప్రయత్నించండి .అతి తక్కువ నూనెతో ఈ పకోడీలు చేసుకొని వర్షాన్ని ఆస్వాదిస్తూ తినండి.