Oil Strains Removal On Wall: గోడలపై పడిన నూనె మరకలను చిటికెలో మాయం చేసే చిట్కాలు, ఇలా చేయండి మరకలను మాయం చేయండి.

Tips to remove oil stains on walls in a pinch..Do this to remove stains

Telugu Mirror: కార్తీకమాసం వచ్చింది. ఈ మాసంలో దీపాలు ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు. దీపాలు పెట్టిన ప్రదేశంలో ఒక్కోసారి గోడల మీద నూనె మరకలు పడటం సర్వసాధారణం.
అయితే గోడలపై పడిన నూనె మరకలు అంత త్వరగా పోవు. వీటిని తొలగించాలంటే కొంత కష్టపడాల్సి వస్తుంది. వీటిని తొలగించడం కోసం నానా పాట్లు పడుతుంటారు.
గోడలపై పడిన నూనె మరకలను తొలగించడానికి కొన్ని చిట్కాలను పాటించినట్లయితే పెద్దగా కష్టపడకుండానే సులువుగానే పోగొట్టుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
సోప్ వాటర్ (Soap Water) :

Tips to remove oil stains on walls in a pinch..Do this to remove stains
omage credit : ozmo smart water bottle

గోడలపై నూనె పడిన ప్రదేశాన్ని సబ్బు నీటితో కడగాలి. ఆ తర్వాత పొడి వస్త్రం మీద కొద్దిగా పాత్రలు శుభ్రం చేసే లిక్విడ్ వేసి మరకలు ఉన్నచోట రుద్దాలి. ఈ విధంగా చేయడం వలన గోడ పై ఉన్న నూనె మరకలు సులువుగా వదిలి పోతాయి.

Also Read:Beauty Tip : ఆహారం లో ఈ పదార్ధాలను తీసుకోండి, సన్ స్క్రీన్ రాయకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి.
బేకింగ్ సోడా (Baking Soda) :

Tips to remove oil stains on walls in a pinch..Do this to remove stains
image credit : one good thing by jillee

గోడలపై నూనె మరకలు పడిన చోట బేకింగ్ సోడాను వేయాలి. కొద్దిసేపు అలానే వదిలేయాలి. ఆ తర్వాత బేకింగ్ సోడాను నూనె పీల్చుకుంటుంది. దీంతో ఆ మరక సులువుగా వదిలిపోతుంది.
నిమ్మరసం (Lemon Juice) :

Tips to remove oil stains on walls in a pinch..Do this to remove stains
image credit : Epicurious

నూనె మరకలను తొలగించే గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. గోడలపై మరకపడిన దగ్గర కొద్దిగా నిమ్మ రసాన్ని వేసి కొద్దిసేపు అలానే వదిలేయాలి. ఆ తర్వాత తడి క్లాత్ తో నిమ్మరసాన్ని తుడవాలి.ఈ విధంగా చేస్తే గోడలపై ఉన్న నూనె మరక తొలగిపోతుంది.

Also Read: Vaastu Tips : సుఖ సంతోషాలు,సిరిసంపదలు కలగాలంటే వాస్తు శాస్త్ర ప్రకారం ‘రాగి సూర్యుడి’ని ఈ దిశలలో ఉంచాలి.

గోధుమపిండి (Wheat Flour) :

Tips to remove oil stains on walls in a pinch..Do this to remove stains
image credit : India Mart

గోధుమపిండి ని ఉపయోగించి గోడలపై పడిన నూనె మరకలను పోగొట్టుకోవచ్చు. గోడపై నూనె మరకలు ఉన్న దగ్గర గోధుమ పిండిని చల్లి ఒక గంట సేపు అలానే వదిలేయాలి. గంట తర్వాత గోధుమపిండి నూనెను పీల్చుకుంటుంది. ఆ తర్వాత పిండిని తొలగించాలి. ఇలా చేయడం వలన గోడపై ఉన్న నూనె మరకలు సులువుగా తొలగిపోతాయి.
కాబట్టి గోడల పై నూనె మరకలు వదలక పోతే ఈ టిప్స్ ని అనుసరించి మరకలను త్వరగా, సులువుగా తొలగించవచ్చు. ‌

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in