Telugu Mirror: కార్తీకమాసం వచ్చింది. ఈ మాసంలో దీపాలు ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు. దీపాలు పెట్టిన ప్రదేశంలో ఒక్కోసారి గోడల మీద నూనె మరకలు పడటం సర్వసాధారణం.
అయితే గోడలపై పడిన నూనె మరకలు అంత త్వరగా పోవు. వీటిని తొలగించాలంటే కొంత కష్టపడాల్సి వస్తుంది. వీటిని తొలగించడం కోసం నానా పాట్లు పడుతుంటారు.
గోడలపై పడిన నూనె మరకలను తొలగించడానికి కొన్ని చిట్కాలను పాటించినట్లయితే పెద్దగా కష్టపడకుండానే సులువుగానే పోగొట్టుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
సోప్ వాటర్ (Soap Water) :
గోడలపై నూనె పడిన ప్రదేశాన్ని సబ్బు నీటితో కడగాలి. ఆ తర్వాత పొడి వస్త్రం మీద కొద్దిగా పాత్రలు శుభ్రం చేసే లిక్విడ్ వేసి మరకలు ఉన్నచోట రుద్దాలి. ఈ విధంగా చేయడం వలన గోడ పై ఉన్న నూనె మరకలు సులువుగా వదిలి పోతాయి.
Also Read:Beauty Tip : ఆహారం లో ఈ పదార్ధాలను తీసుకోండి, సన్ స్క్రీన్ రాయకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి.
బేకింగ్ సోడా (Baking Soda) :
గోడలపై నూనె మరకలు పడిన చోట బేకింగ్ సోడాను వేయాలి. కొద్దిసేపు అలానే వదిలేయాలి. ఆ తర్వాత బేకింగ్ సోడాను నూనె పీల్చుకుంటుంది. దీంతో ఆ మరక సులువుగా వదిలిపోతుంది.
నిమ్మరసం (Lemon Juice) :
నూనె మరకలను తొలగించే గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. గోడలపై మరకపడిన దగ్గర కొద్దిగా నిమ్మ రసాన్ని వేసి కొద్దిసేపు అలానే వదిలేయాలి. ఆ తర్వాత తడి క్లాత్ తో నిమ్మరసాన్ని తుడవాలి.ఈ విధంగా చేస్తే గోడలపై ఉన్న నూనె మరక తొలగిపోతుంది.
గోధుమపిండి (Wheat Flour) :
గోధుమపిండి ని ఉపయోగించి గోడలపై పడిన నూనె మరకలను పోగొట్టుకోవచ్చు. గోడపై నూనె మరకలు ఉన్న దగ్గర గోధుమ పిండిని చల్లి ఒక గంట సేపు అలానే వదిలేయాలి. గంట తర్వాత గోధుమపిండి నూనెను పీల్చుకుంటుంది. ఆ తర్వాత పిండిని తొలగించాలి. ఇలా చేయడం వలన గోడపై ఉన్న నూనె మరకలు సులువుగా తొలగిపోతాయి.
కాబట్టి గోడల పై నూనె మరకలు వదలక పోతే ఈ టిప్స్ ని అనుసరించి మరకలను త్వరగా, సులువుగా తొలగించవచ్చు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…