Telugu Mirror: ఎన్నికల అఫిడవిట్ ను మార్చారు అనే అభియోగం లో రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్(V. Srinivas Goud) పై శుక్రవారం కేసు నమోదు చేసినారు.
హైదరాబాద్ లోని ఎం.పీలు,ఎమ్మెల్యే ల ప్రత్యేక కోర్టు ఆదేశాలను అనుసరించి మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర టూరిజం(telangana state tourism) మరియు ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో 10 మంది ఎన్నికల అధికారుల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసినారు.
అంతకు ముందు మంత్రి తో పాటు ఇతరులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు మహబూబ్ నగర్ పోలీసుల(mahabubnagar police)కు ఆదేశాలను జారీ చేసింది. రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి నమోదు చేసిన పిటిషన్ పై న్యాయ స్థానం నుండి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. కోర్టు ఆదేశాలను అనుసరించి పోలీసులు కేసు నమోదు చేయడంలేదని పిటిషనర్ ఎంపీ,ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం ముందుకు కేసును తీసుకొచ్చారు. కేసు వివరాలను వెంటనే ఇవ్వాలని ఆదేశించిన కోర్టు, కేసు బుక్ చేసినారా? అని పోలీసులను ప్రశ్నించింది.
Also Read:Runa Mafi: తెలంగాణ రైతుల రుణమాఫీ పై సందేహాల వర్షం.. పూర్తి వివరణ మీ కోసం
పోలీసులు కేసు నమోదు చేసినట్లయితే దాని తాలూకు ఎఫ్.ఐ.ఆర్., మిగిలిన వివరాలను సాయంత్రం వరకు సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పి.పి.) పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ కేసు నమోదు చేసే విషయంలో మహబూబ్ నగర్ పోలీసులు విఫలం చెందితే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లుగా పరిగణలోకి తీసుకుంటామని హెచ్చరించింది.
2018లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో రికార్డులను మార్చారని, ఎన్నికల అధికారుల ఎదురుగానే మహబూబ్ నగర్ లో ఎన్నికల అఫిడవిట్ ను ట్యాంపర్ చేసినారు అని, మంత్రి శ్రీనివాస్ గౌడ్ భార్య కొనుగోలు చేసిన భూములు, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంభందించిన వివరాలను దాచిపెట్టారని పిటిషనర్ రాఘవేంద్ర రాజు ఆరోపణ చేసినారు.
శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి B.R.S. (అప్పటి TRS) అభ్యర్థిగా ఎన్నికైనారు. పిటిషనర్ ఆరోపణల ప్రకారం, శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ పత్రాలతో పాటు, అఫిడవిట్ లు సమర్పించారు అని, వాటిని మార్చి ఎన్నికల అధికారి ఎదురుగానే పాత వాటి స్థానంలో కొత్త అఫిడవిట్ లను అప్ లోడ్ చేసినారు అని పిటిషనర్ రాఘవేంద్ర రాజు ఆరోపించారు. ఈ విషయంపై పిటిషనర్ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినారు. ఈ విషయమై ఎన్నికల సంఘం కూడా విచారణ చేస్తుంది.