OnePlus 11 5G : స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో చాలా కంపెనీలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ సైతం మంచి ఆఫర్‌ను ప్రకటించింది. వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎంత డివన్స్కౌంట్ లభిస్తోంది, ఈ ఫోన్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్లస్ 11 5జీ (OnePlus 11 5G) ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్, సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చింది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 10-బిట్ ఎల్టీపీఓ 3.0 అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటది. హైపర్ బూస్ట్ గేమింగ్ ఇంజిన్, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ యూఐ ఓఎస్ వర్షన్ కలిగి ఉంటుంది. గత జనవరిలోనే వన్ ప్లస్ 11 5జీ ఫోన్ కొనసాగింపుగా వన్ ప్లస్ 12 5జీ ఫోన్ ఆవిష్కరించింది.
వన్ ప్లస్ 11 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ లాంచింగ్ ధర రూ.56,999 కాగా, ఇప్పుడు రూ.51,999లకే లభిస్తుంది. ఇంతకుముందే రూ.2000 తగ్గించిన వన్ ప్లస్, తాజాగా మరో రూ.3,000 ధర తగ్గించింది. వన్ ప్లస్ 11 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్రొటెక్షన్ తోపాటు 6.7 అంగుళాల క్వాడ్ హెచ్డీ+ (1440×3216 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. అడెర్నో 740 జీపీయూతోపాటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13 ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుందీ.
50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 48-మెగా పిక్సెల్ 0.5 అంగుళాల సోనీ ఐఎంఎక్స్ 581 సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 1/2.74 అంగుళాల సోనీ ఐఎంఎక్స్ 709 సెన్సర్ విత్ టెలిఫోటో, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సోనీ ఐఎంఎక్స్ 471 సెన్సర్ కెమెరా ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, అలర్ట్ స్లైడర్ ఉంటుంది. 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ 2.0 టైప్ సీ కనెక్టివిటీ ఉంటుంది.
OnePlus 11 5G
Also Read:WhatsApp New Feature : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఇది చాలా యూజ్ ఫుల్ బాస్.