OnePlus Ace 2 : కిరాక్ ఫీచర్స్ తో OnePlus Ace 2..’రెయిన్ టచ్’ టెక్నాలజీ తో ఆగష్టు16న విడుదల..

Telugu Mirror : చైనాలో గత ఏడాది ఆగస్టులో విడుదల అయిన OnePlus Ace Pro యొక్క సీక్వెన్స్ హ్యాండ్ సెట్ OnePlus Ace 2 చైనాలో విడుదల కానున్నది. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన కొన్ని ఫీచర్ లను కంపెనీ విడుదల చేసింది. OnePlus Ace 2 ఎన్నో గొప్ప ఫీచర్ లతో రాబోతున్నది. ఇది ఒక ఫ్లాగ్షిప్ మోడల్ అని చెప్పవచ్చు.OnePlus Ace 2 120Hz ( 1,240×2,772 pixels ),రిఫ్రెష్ రేట్ కలిగిన 6.74- inch OLED డిస్ ప్లే తో రానున్నది. ఈ స్మార్ట్ ఫోన్ 450ppi పిక్సెల్ డెన్సిటీ మరియు 2160Hz PWM దిమ్మింగ్ రేట్ తో వస్తుంది. అలానే ఈ ఫోన్ ” రెయిన్ టచ్ ” అనే కొత్త టెక్నాలజీ తో వస్తుంది. 1,600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ సపోర్ట్ తో వస్తుంది.

Image Credit : The times Of india

OnePlus Ace 2 ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో రాబోతున్నది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలయిజేషన్ ఉన్న 50- మెగా పిక్సెల్ Sony IMX890 మెయిన్ కెమెరా తో వస్తుంది. 8- మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2- మెగా పిక్సెల్ మాక్రో కెమెరాతో అందుబాటులోకి రానుంది. అలానే 16- మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో వస్తుంది.OnePlus Ace 2 LPDDR5x 24GB RAM మరియు 1TB ఇన్బిల్ట్ స్టోరేజ్ తో విడుదల అవ్వబోతుంది. అలానే Qualcomm Snapdragon 8 Gen 2 SoC ఆక్ట కోర్ ప్రాసెసర్ తో రానున్నది. ఈ హ్యాండ్ సెట్ బీస్ట్ పెర్ఫార్మెన్స్ ను అందజేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ బయోనిక్ విబ్రేటింగ్ మోటార్ ను కలిగి ఉంటుంది.

Reliance Jio: త్వరలో జియో నుంచి అద్భుతమైన ఫీచర్స్ తో రెండూ 5G స్మార్ట్ ఫోన్స్ విడుదల

OnePlus Ace 2 5000mAh బ్యాటరీతో రాబోతున్నది. ఈ హ్యాండ్ సెట్ 150W superVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ 150W ఛార్జర్ తో 20 నిమిషాల్లో 1 పర్సెంట్ నుంచి 100 పర్సెంట్ ఛార్జింగ్ కు చేరుకుంటుంది. అలానే ఈ ఫోన్ యొక్క బ్యాటరీ 4 సంవత్సరాల పాటు వస్తుందట. ఈ స్మార్ట్ ఫోన్ WiFi 7 ను సపోర్ట్ చేస్తుంది WiFi 6 కంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలానే 5G నెట్ వర్క్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.OnePlus Ace 2 ఆగష్టు 16 2023 న విడుదల కానున్నది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in