Telugu Mirror : OnePlus Nord 3 5G జూలై 5 న విడుదల కాబోతున్నది. దీంతో పాటు OnePlus Nord CE 3 మరియు Nord Burds 2R కూడా విడుదల కానున్నాయి. OnePlus Nord 3 5G 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగిన డిస్ ప్లే తో వస్తుంది. అలానే OnePlus Nord 3 6.74-inch డిస్ ప్లే తో వస్తుంది. అలానే 1.5k రెజల్యూషన్ కలిగిన AMOLED డిస్ ప్లే తో OnePlus Nord 3 5G రాబోతుంది. OnePlus Nord 3 5G రెండు కలర్ ఆప్షన్ లతో అందుబాటులోకి రానుంది, టెంప్ సెట్ గ్రే మరియు మిస్టీ గ్రీన్ కలర్ లలో రిలీజ్ కానుంది. OnePlus Nord 3, OnePlus Ace 2V యొక్క రీ బ్రాండెడ్ వెర్షన్.
IPhone 14 : యాపిల్ ప్రియులకు అమెజాన్ లో పెద్ద డిస్కౌంట్..
ఈ ఫోన్ చైనాలో విడుదల అయ్యింది. Nord 3 కూడా దాదాపు Ace 2V యొక్క స్పెసిఫికేషన్ లతోనే రాబోతుంది. Ace 2V MediaTek Dimensity 9000 SoC 4nm ఆక్టా కోర్ చిప్ సెట్ తో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. అలానే 80W superVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. OnePlus Nord 3 కూడా MediaTek Dimensity 9000 SoC చిప్ సెట్ తో వస్తుంది. అలానే ఈ ఫోన్ 16GB LPDDR5X RAM మరియు UFS 3.1, 256GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ తో రాబోతుంది. OnePlus Nord 3 5G ఆండ్రాయిడ్ వెర్షన్ 13 మీద రన్ అవుతుంది.
అలాగే OnePlus యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అయిన Oxygen 13.1 తో విడుదల కానున్నది. ఈ హ్యాండ్ సెట్ మూడు కెమెరాలతో రాబోతుంది. 50MP + 8MP + 2MP కెమెరా సెట్ అప్ తో రానుంది. మెయిన్ కెమెరా 50- మెగా పిక్సెల్ తో వస్తుందో లేదో తెలియదు. ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో కూడిన Sony IMX890 సెన్సార్ తో రాబోతుంది. ఒక 8- మెగా పిక్సెల్ మరియు 2- మెగా పిక్సెల్ కెమెరాలతో వస్తుందని సమాచారం. 16- మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అందుబాటులోకి రాబోతుంది.
Samsung Galaxy S21 FE 5G : రీ లాంచ్ కు సిద్దంగా ఉన్న Galaxy..
ఇలా మూడు కెమెరాలతో Nord 3 రిలీజ్ అవ్వబోతుంది. OnePlus Nord 3 5G కూడా 80W superVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీతో హ్యాండ్ సెట్ రాబోతుంది. ఈ హ్యాండ్ సెట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కలిగిన స్పీకర్ లతో రావచ్చు. అలానే NFC కనెక్టివిటీ మరియు IR బ్లాస్టర్ వంటి ఫీచర్ లతో రావచ్చు. OnePlus Nord 3 5G యొక్క స్పెసిఫికేషన్ గురించి కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ జూలై 5 న విడుదల కానుంది అప్పటి దాకా ఈ ఫోన్ ఎలా ఉంటుందో తెలియదు.