Categories: Blog

Online Scams : ఆన్ లైన్ మోసాలను ఇలా ఎదుర్కోవచ్చు. అప్రమత్తతే ఆయుధం.

ప్రస్తుతం రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. అత్యాధునిక సాంకేతికత (technology) అనేది సామాన్య మానవులకి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు గానీ, స్కామర్లు మాత్రం టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు.

ప్రజలకు (the people) అవగాహన లేని విధానాలలో బాగానే బురిడీ కొట్టించి మరీ కుచ్చు టోపి పెడుతున్నారు.
ఆన్ లైన్ లోనే ప్రజల బ్యాంక్ అకౌంట్ (Bank account) లను ఖాళీ చేస్తున్నారు.

మరి ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ల వినియోగం అధికమైనప్పటి నుండి ప్రజలను బాగా మోసం చేస్తున్నారు. స్పామ్ కాల్ (Spam call) ద్వారా, మెసేజ్ ల ద్వారా, ఆన్ లైన్ జాబ్ (Job) పేరిట ఇలా రకరకాల పద్ధతులను ఉపయోగించి ప్రజలను ఫ్రాడ్ చేసేవాళ్లు విపరీతంగా పెరిగి పోతున్నారు.

Also Read : Apple iPhone15 : ఇప్పుడు రూ.12,000 తగ్గింపుతో ఆపిల్ ఐఫోన్ 15 ను Amazon India లో పొందండి. వివరాలివిగో

మెసేజ్ లు పంపించే లింకులు ద్వారా మొత్తం బ్యాంక్  ఖాతాలను (Bank accounts) హ్యాక్ (Hack) చేస్తున్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే స్పామ్ కాల్స్ ఫ్రాడ్ మెసేజ్ ల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.

నిపుణుల నుండి సేకరించిన అంశాలను తెలుసుకోవడం ద్వారా స్కామర్ల వలలో చిక్కు కోకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది.

అయితే కొన్ని రకాల టిప్స్ ను ఫాలో అవ్వడం ద్వారా స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.

తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే జాగ్రత్తగా మాట్లాడాలి. అవతల వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా వ్యక్తిగత సమాచారాన్ని చెప్పకూడదు.

Image Credits : The US Sun

మీకు ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే విషయంలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఫోన్ చేసినవారు చట్టబద్ధమైన (Legal) వారా? కాదా ?అని నిర్ధారణ చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలను వారిని అడగాలి. అప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది.

ఫోన్ లో పాస్ వర్డ్ లేదా ఆర్థిక వివరాలు (Financial details), ఒటిపి (OTP) లు మరియు పర్సనల్ డేటా వంటి వివరాలను చెప్పకూడదు.

కొత్త నెంబర్ నుండి ఫోన్ వస్తే సమాధానం చెప్పేముందు ఆలోచించి మాట్లాడాలి. దీనిని వాయిస్ మెయిల్ కి వెళ్ళ నివ్వాలి.

Also Read : Samsung Galaxy : శామ్ సంగ్ నుంచి చౌకైన స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A05 భారతదేశంలో విడుదల. ధర, లభ్యత తెలుసుకోండి.

రెడ్ ఫ్లాగ్ (Red flag) ల కోసం చూడాలి. అయాచిత ఆఫర్లు లేదా డబ్బుల కోసం అత్యవసర అభ్యర్థులు వంటి సంభావ్య (Probable) స్కామ్ సంకేతాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

స్కామర్లు ఒత్తిడి (stress) తో కూడిన పన్నాగా లను ఉపయోగిస్తారు. అనగా ఈరోజు ఇది క్లైమ్ చేయకుంటే మీరు ఈ ఆఫర్ ను పోగొట్టుకుంటారు అని చెప్తూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

అనుమానం వస్తే కాలర్ ఇచ్చిన నంబర్ కు బదులుగా అధికారిక సంప్రదింపు (Official contact) నెంబర్ ను ఉపయోగించి డైరెక్ట్ గా కంపెనీ లేదా సంస్థతో సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలి.

కాల్ బ్లాకింగ్ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవాలి. దీనివల్ల స్కామ్ కాల్ ను గుర్తించి, బ్లాక్ (Block) చేయడం సులభతరం అవుతుంది.

Also Read : ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో రూ.1,50,000 జీతం వచ్చే ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల. దరఖాస్తు చివరితేదీ ఎప్పుడంటే..

బెదిరింపులను తెలివిగా గుర్తించడానికి మోసగాళ్లు ఉపయోగించే సాధారణ స్కీమ్ లు, వ్యూహా (strategy) ల గురించి, ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

ఫోన్ చేసిన వ్యక్తితో సన్నిహితంగా (intimately) ఎప్పుడూ మాట్లాడకూడదు.

కాబట్టి ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టవచ్చు. తద్వారా మోస గాళ్ల (Fraudsters) వలలో పడకుండా ఉంటాము.

Telugu Mirror

Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in

Recent Posts

ವಿಕ್ರಂ ಗೌಡ ನಕ್ಸಲ್ ನಿಗ್ರಹ ಪಡೆ ಪೊಲೀಸರ ಬಲೆಗೆ ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಬಿದ್ದಿದ್ಹೇಗೆ

ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್​ಎಫ್​ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್​​ಕೌಂಟರ್​…

4 weeks ago

make sure working

ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್​, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್‌ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…

4 weeks ago

Aadhaar Update : ఆధార్ కార్డు నవీకరణకు మరో అవకాశం.. ఏపీలో ప్రత్యేక డ్రైవ్.. ఎప్పటి నుంచి అంటే?

[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…

5 months ago

Microsoft Windows crashes : మైక్రోసాప్ట్ విండోస్ క్రాష్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు.

[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…

5 months ago

Samsung Galaxy M35 5G : శాంసంగ్ నుంచి క్రేజీ డీల్.. తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్స్‌.

Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…

5 months ago

Honor 200 5G Series : అదరగొట్టిన హానర్.. టెలిఫొటో కెమెరాలతో హానర్ 200 5జీ సిరీస్.. ధర ఎంతో తెలుసా?

Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…

5 months ago