Qamar Mohsin Sheikh : మోడీకి 31వ సారి రాఖీ కట్టేందుకు సిద్దమైన పాక్ సోదరి.

Telugu Mirror: రక్షా బంధన్ అందరికీ ఒక ఆత్మీయ పండుగ. అక్క, చెల్లి తమ అన్నలకు, తమ్ముళ్లకు కట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునే ఒక మధురమైన పండుగ. అందరూ నచ్చే, మెచ్చే ఈ పండుగ మనకు అతి సమీపంలో ఉంది. ఈ నెల అనగా ఆగష్టు 30 వ తారీఖున జరుపుకోబోతున్నాం. ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఈ పండుగ పూర్ణిమ నాడు కానీ పౌర్ణమి నాడు కానీ జరుపుకుంటారు. అయితే PM గారికి రాఖీ కట్టేందుకు తన చెల్లెలు కమర్ రాబోతున్నట్లు ANI సంస్థ వెల్లడించారు.

పాకిస్థానీ మహిళా కమర్ మొహ్సిన్ షేక్ (Qamar Mohsin Sheikh) తన వివాహానంతరం, రాఖి దగ్గరికి వస్తున్న సందర్బంగా భారత దేశానికి వచ్చి భారత దేశ రాజధాని అయిన ఢిల్లీ (Delhi) లో మన PM మోడీ గారి కి రాఖీని కట్టబోతున్నట్లు తెలిపారు.

Also Read:Russia Luna 25: రష్యా లూనా 25 మూన్ మిషన్ నిరాశను మిగిల్చింది, చంద్రుని పై కుప్పకూలిన స్పేస్ క్రాఫ్ట్.

ఈ సందర్బంగా కమర్ మొహ్సిన్ షేక్ 30 సంవత్సరాల క్రితం పాకిస్థాన్ (Pakistan) నుండి భారత దేశానికి వచ్చింది. PM గారికి గత 30 ఏళ్లుగా రాఖీ ని కడుతున్నట్లు ANI సంస్థ తెలిపింది. అయితే నరేంద్ర మోడీ (NarendraModi) గారికి రాఖీ కట్టడానికి ఈ నెల 30 న 31వ సారి రాఖీ కట్టేందుకు భారతదేనికి రాబోతున్నారు. కమర్ ఎల్లప్పుడూ తను ఆరోగ్యంతో , దీర్ఘాయుష్షును కలిగి ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాఖి కట్టిన ప్రతిసారి మోడీ ఆరోగ్యం గురించి తాను దేశానికి చేసే కృషి గురించి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు . మరియు దేశాభివృద్ధికి మోడీ చేసే పనులను పొగిడారు. ఆమె కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయని భావిస్తున్న అని చెప్పారు. ఒకప్పుడు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి కావాలి అనుకున్న. అదే విధంగా సీఎం అయ్యారు. ఇది వరకు మోడీ గుజరాత్ (Gujarat) రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పని చేసిన సమయం లో ఆమె రాఖీ కట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె కోరిన కోరికలు తీరిపోయాయని కూడా పేర్కొన్నారు. కమర్ స్వయంగా తన చేతితో తయారు చేసిన రాఖీని కట్టడం మరింత విశేషం అని చెప్పొచ్చు.

కమర్ మోడీ కి రాఖీ కట్టిన ప్రతిసారి మోడీ క్షేమం గురించి , తాను ప్రధాన మంత్రి అవ్వాలనే కోరిక నెరవాలని ప్రార్థన చేస్తూ ఉంటా అని వెల్లడించింది. కోవిడ్- 19 లాక్ డౌన్ కారణం చేత అతనికి రాఖి కట్టలేదని మరియు రాఖీ రోజున రక్షా బంధన్ (Raksha Bandhan) పోస్ట్ పెట్టానని తాను చెప్పారు.

ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పని చేసిన సమయంలో మొట్ట మొదటి సారి రాఖి కట్టినట్లు , అప్పటినుండి ప్రతి ఏటా రాఖీని కడుతూనే ఉన్నారని చెప్పారు. అయితే 31వ సారి రాఖి కట్టేందుకు ఢిల్లీ వస్తున్నట్టు కమర్ ANI వార్త సంస్థ ద్వారా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.