Telugu Mirror:
ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్(Smart Phone) వినియోగించే ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల(Social Media)లో ఎక్కువ భాగం గడుపుతున్నారు. జీవితంలో సోషల్ మీడియా కూడా ఒక భాగంగా మారింది .స్మార్ట్ ఫోన్ తో వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి, వారి భావాలను ఎదుటి వ్యక్తులతో పంచుకోవడానికి, సమాజంలో జరుగుతున్న విషయాలను, తెలుసుకోవడానికి సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ సోషల్ మీడియా ను వాడటం వల్ల ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు. అవి ఒక్కొక్క సందర్భంలో ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.
జార్ఖండ్(Jharkhand)కి చెందిన అజయ్ మహతో అనే వ్యక్తి పంటి నొప్పితో బాధపడుతున్నాడు. అతను వైద్యుడిని సంప్రదించకుండా యూట్యూబ్(youtube) లో చూసి సొంత వైద్యం చేశాడు. పంటినొప్పి రావడంతో ఫోన్ లో యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో కొన్ని రెమెడీస్ చూశాడు. దానిలో ఒకటి అనుసరించి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ లో అతను చూసిన వీడియోలో పంటి నొప్పి తగ్గడానికి ఒలియాండర్ (Oleander) గింజలు తింటే తగ్గుతుందని చెప్పారు. అతను ఆ గింజలను ఎక్కువ మొత్తంలో తినడం వలన అతని ఆరోగ్యం క్షీణించింది .వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు అతన్ని పరీక్షించి, చనిపోయినట్లు నిర్ధారించి చెప్పారు.అజయ్ మహతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. వారం రోజుల క్రితం తీవ్రమైన పంటి నొప్పివచ్చిందని అతని తండ్రి తెలిపాడు. యూట్యూబ్ లో వీడియో చూసి ఫాలో అయ్యి ప్రాణాలు మీదకి తెచ్చుకున్నాడు.
Also Read:Marital sex life : మీ దాంపత్య లైంగిక జీవితానికి బూస్టింగ్ ఇచ్చే పండ్లు ..
అయితే ఒలియాండర్ తీసుకోవడం వల్ల పంటి నొప్పి తగ్గుతుందని హెల్త్ రికార్డ్స్ లో ఎక్కడా లేదు అని నిజానికి ఒలియాండర్ మొక్క ఆకులు, విత్తనాలు విషపూరితమైనవి అని ఆరోగ్య నిపుణులు కనుగొన్నారు.
ఒలియాండర్ మొక్కను 15వ శతాబ్దం నుంచి మూలికావైద్యులు ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క రోగాలను కలిగించే క్రీములను నాశనం చేస్తుంది. ఈ మొక్కను అనుభవం ఉన్న మూలిక నిపుణులు, అవసరమైనప్పుడు తగు మోతాదులో ఉపయోగిస్తారు.
గురు గ్రామ్(gurugram) లోని ఇంటెన్సివ్ కేర్ కు సంబంధించిన డాక్టర్ నందన్ సమీర్ వార్తా సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ ఇది చాలా భయంకరమైన పరిస్థితి అని ఇలాంటివి చాలా కేసులు ఆసుపత్రులకు తరచుగా వస్తూ ఉంటాయి. చాలా మంది సోషల్ మీడియాలో వచ్చేవి చూసి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు అన్నారు. డాక్టర్ నందన్ సమీర్ మాట్లాడుతూ అందరి శరీరం యొక్క పనితీరు ఒకేలాగా ఉండదు .ఒక వ్యక్తికి ప్రయోజనం చేకూర్చే ప్రిస్క్రిప్షన్ మందు అందరికీ పనిచేస్తుందని అనుకోవడం పొరపాటు. ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే వైద్యుడిని సంప్రదించి ,డాక్టర్ సూచించిన మందులనే వాడాలి. సొంత వైద్యం చేయకూడదు.
Also Read:SVS : స్మార్ట్ ఫోన్ తో కళ్లకు కష్టకాలం.. స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ అసలు కారణమా?
సోషల్ మీడియాలోని వ్యక్తులు తమ ఛానల్ లో వ్యూస్ కోసం కంటెంట్ పేరుతో ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటారు. వాటి గురించి పూర్తి అవగాహన లేకుండా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ ఉంటారు .అవి గుడ్డిగా నమ్మి వాటిని ప్రయత్నం చేయకూడదు. ఎటువంటి వ్యాధి అయినప్పటికీ సోషల్ మీడియాలో వచ్చే రెమెడీలను ఉపయోగించకూడదు. లేదా మరొకరికి రాసిన మందులను ఉపయోగించకూడదు. ఏదైనా అనారోగ్యం ఉంటే డాక్టర్ని సంప్రదించి వారు సూచించిన మందులనే వాడాలి అని డాక్టర్ సమీర్(Doctor Sameer)తెలిపారు.