Pension Release in AP: ఏపీలో పెన్షన్ల నిధులు విడుదల, బ్యాంకు ఖాతాల్లోకి జూన్ 1 నుండి జమ
ఏపీలో పెన్షన్ల నిధులు రూ.1,939.35 కోట్లు విడుదల చేసింది ఏపీ సర్కార్. జూన్ 1 నుండి 5వ తేదీలోపు బ్యాంకు ఖాతాల్లోకి పంపిణీ.
Pension Release in AP: ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పింఛన్ లబ్ధిదారుల పరిస్థితి వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. పలు కారణాల వల్ల ఏపీలో ప్రజలకి పెన్షన్ (Pension) అందడం కాస్త ఆలస్యం అయింది. అన్ని ప్రశ్నలకు మరియు ప్రజల్లో వస్తున్న అనుమానాలకు ఏపీ ప్రభుత్వం (AP Government) చెక్ పెట్టింది. అయితే జూన్ నెల పెన్షన్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జూన్ నెల పింఛన్ల పంపిణీ:
జూన్ 1న పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.వికలాంగులు, నడవలేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వీల్‌ఛైర్‌లో ఉన్న వారికి నేరుగా వారి ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది.
పెన్షన్ నిధుల విడుదల
జూన్ నెల సామాజిక భద్రతా పెన్షన్ నిధులను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 65,30,808 పింఛన్‌దారులకు రూ.1,939.35 కోట్లు పంపిణీ చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ (Shashi Bhushan Kumar) వెల్లడించారు. జూన్ 1వ తేదీన 47,74,733 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి పింఛన్ నిధులు జమ చేస్తామని, జూన్ 1 నుంచి 5వ తేదీలోపు 17,56,105 మంది లబ్ధిదారులకు ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఎన్నికల కోడ్ (Election Code) లో భాగంగా, ఎన్నికల నియమావళిని పాటిస్తూ పింఛన్లు అందజేయాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. సచివాలయ అధికారులు ఇంటింటికీ వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ లబ్ధిదారులను ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చి ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ పంపిణీ చేశారు. మేలో ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక పోతే ఏపీలో జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో చూడాలి.
Comments are closed.