నేటి నుంచి (ఆగష్టు 5) అంతర్జాతీయ ప్రయాణాలకు పాస్‌పోర్ట్(passport)పొందడం కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో గణనీయమైన మార్పు వచ్చింది. దరఖాస్తుదారులు కొత్త పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ఇప్పుడు ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్ అయిన డిజిలాకర్ ఉపయోగించి పాస్ పోర్ట్ కోసం అవసరమైన సపోర్టింగ్ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ని అప్‌లోడ్ చేసిన తర్వాత, పాస్ పోర్ట్ దరఖాస్తుదారులు తమ దరఖాస్తును ఆన్ లైన్ లో అధికారిక వెబ్‌సైట్ www.passportindia.gov.in ద్వారా సమర్పించవలెను.
దరఖాస్తుదారులు తమ పత్రాలను అప్‌లోడ్ చేయడానికి డిజిలాకర్‌ని ఉపయోగిస్తే, ప్రభుత్వ స్కీమ్ సమాచారం ద్వారా తెలియ జేసిన దరఖాస్తు విధానంలో వారు అసలు ఫిజికల్ కాపీస్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది. డిజిలాకర్ లో నమోదు చేసుకోవడం వలన ప్రాసెసింగ్ సమయాన్ని రెగ్యులరైజ్ చేస్తుంది మరియు పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది అని భావిస్తున్నారు.
Also Read:chedodu Scheme–జగనన్న అందించే చెడోడు పథకం ..ఆన్‌లైన్ తనికీకై ఇలా చేయండి
డిజిలాకర్(digi locker)అంటే ఏమిటి?
డిజిలాకర్ అనేది భారతీయ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(information technology)మంత్రిత్వ శాఖ అందించిన డిజిటల్ వాలెట్ సేవ ద్వారా కలిగే ప్రయోజనం. డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు(vehicle registration certificates), అకడమిక్ మార్కుల పత్రాలు మరియు ఇంకా చాలా ప్రభుత్వంచే జారీ చేసిన వివిధ పత్రాలను డిజిటల్‌గా సురక్షితంగా నిల్వ చేయడానికి మరియు పొందటానికి దీనిని ఉపయోగించే వారిని అనుమతిస్తుంది.
డిజిలాకర్ ద్వారా ఆధార్ పత్రాలను
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణల కోసం వినియోగించడానికి మంత్రిత్వ శాఖ ఇప్పుడు అనుమతించింది.
డిజిలాకర్ సేవలను ఉపయోగించేవారు స్టడీ సర్టిఫికెట్స్ , జనన ధృవీకరణ పత్రాలు, PAN కార్డ్‌లు, ఆధార్ కార్డ్‌లు, పాస్‌పోర్ట్‌లు మరియు ఓటర్ ID కార్డ్‌ల వంటి ముఖ్యమైన అధికారిక పత్రాలను దాచివుంచడానికి మరియు ఉపయొగించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది, గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం డిజిలాకర్ దరఖాస్తుదారులకు మరింత వేగంగా మరియు సౌకర్యవంతంగా ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది.
పలు ఏరియాలలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (PSKలు) మరియు పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (POPSKలు)లో దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయడానికి మరియు ఫిజికల్ డాక్యుమెంట్స్ ధృవీకరణ చేసే అవసరాన్ని తగ్గించడానికి ఈ మార్పును అమలు చేయబడింది.
పాస్ పోర్ట్ సేవా కేంద్రాలలో ఫిజికల్ డాక్యుమెంట్స్(physical documents)ధృవీకరణ సమయంలో తప్పుగా ఉన్న బర్త్ డేట్(birth date)లు మరియు వ్యక్తిగత వివరాలు వంటి వాటిలో తేడాలకు ప్రతిస్పందనగా డిజిలాకర్ ని వినియోగించాలనే నిర్ణయం తీసుకోబడింది. డిజిలాకర్‌ని విధానాన్ని అమలు పరచడం ద్వారా, అప్ డేట్ చేసిన పత్రాల ఖచ్చితత్వం మరియు ప్రామాణికతను నిర్ధారించడమే ప్రభుత్వ లక్ష్యం.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…