Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయిందని మీకేలా తెలుస్తుంది? ఈ టిప్స్ తో కనిపెట్టేయండి.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇంటర్నెట్ను ఎక్కువగా వాడుతుండడంతో ఫోన్ హ్యాకింగ్ సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. మీ ఫోన్ హ్యాక్ అయిందని ఎలా తెలుస్తుందో ఇప్పుడు చూద్దాం.
Phone Hacking : ఆధునికత పెరుగుతుండడంతో వివధ రకాల స్మార్ట్ ఫోన్ (Smart phone)ల వాడడం కూడా పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇంటర్నెట్ను (internet) ఎక్కువగా వాడుతుండడంతో ఫోన్ హ్యాకింగ్ సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఫోన్ హ్యాక్ అయి ఎంతో మంది మోసపోయినట్లు కూడా ఎన్నో వార్తల్లో మనం చూసే ఉంటాం. ఫోన్లను హ్యాక్ చేయడానికి హ్యాకర్లు (Hackers) కొత్త కొత్త పద్ధతులను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అయితే మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది? అనే విషయం గురించి తెలుసుకుందాం.
మీ ఫోన్లో అనవసరమైన యాప్‌లను ఉంచుకోవద్దు.
మీరు ఉపయోగించని యాప్‌లు మీ ఫోన్లో ఉంచడం అంత మంచిది కాదు. చాలా సార్లు, మీ అనుమతి లేకుండా కొన్ని కొన్ని యాప్ లీ ఇన్స్టాల్ అవుతాయి. అలాంటప్పుడు, వాటిని తొలగించడం చాలా ముఖ్యం. ఇది ఫోన్ హ్యాకింగ్‌కు కారణం కావచ్చు. తెలియని యాప్ లలో స్పైవేర్ దాగి ఉండవచ్చు. అందుకే తెలియని యాప్స్ ని వాడకండి.
ఫోన్ లో ఛార్జ్ తొందరగా అయిపోతే జాగ్రత్తగా ఉండండి.
మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతే,అది హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే హ్యాక్ యాప్‌లు ఫోన్ పవర్‌ను త్వరగా అయిపోయేలా చేస్తుంది. ఛార్జింగ్ తొందరగా దిగిపోతుంది అని మీకు అనిపిస్తే అప్రమత్తంగా ఉండడం మంచిది.
బ్యాక్ గ్రౌండ్ నాయిస్ వస్తుందా?
మీ ఫోన్లో కాల్ చేస్తున్నప్పుడు ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ వస్తున్నట్లు మీరు గమనించినట్లయితే .. ఇవి హ్యాకింగ్‌ను గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఫోన్ త్వరగా వేడెక్కిన కూడా జాగ్రత్తగా ఉండాలి.
మీ ఫోన్ త్వరగా వేడెక్కినట్లయితే, హ్యాకర్లు దానిని రియల్ టైమ్ లో ట్రాక్ చేయవచ్చు.వారు జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించి హ్యాక్ చేస్తారు. అటువంటప్పుడు, ఫోన్ హార్డ్‌వేర్ చాలా ఒత్తిడికి లోనవుతుంది. ఫోన్ హ్యాకింగ్ స్క్రీన్ (Hacking screen) ఫ్లాషింగ్, ఫోన్ సెట్టింగ్‌లకు ఆటోమేటిక్ మార్పులు లేదా ఫోన్ పనిచేయకుండా చేస్తుంది.
బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.
మీరు మీ డివైజ్ బ్రౌజింగ్ హిస్టరీని కూడా చూడవచ్చు. చాలా సార్లు ,స్పై యాప్‌లను డౌన్లోడ్ చేస్తే మీ ఫోన్ వారి అధీనంలోకి తీసుకోవచ్చు. అందుకే ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
Comments are closed.