Telugu Mirror : వివాహ వేడుకల్లో షూట్ చేయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్స్ తమదైన స్టైల్ తో ఫోటోలను వేరే లెవెల్ అనిపించే విధంగా ఫొటోస్ ని వీడియోస్ ని తీస్తుంటారు.పెళ్లి పనులు మొదలయిన దగ్గర నుండి ఫోటోగ్రాఫర్స్ బిజీ బిజీ గా ఉంటారు.జీవితం లో మర్చిపోలేని ఒక మంచి మెమోరబుల్ ఫొటోస్ ని తీస్తుంటారు. ఇల్లంతా పెళ్లి హడావుడితో ఎంతో బిజీ గా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఫోటోగ్రాఫర్ ఆ పెళ్లి సందడి లో అందరిని వీక్షిస్తూ ఫోటోలను, వీడియో లను తీస్తున్నాడు. అయితే ఒక ఫోటోగ్రాఫర్ తను వెళ్లిన ఒక వెడ్డింగ్ షూట్ లో అతిథులతో కలిసి నృత్య ప్రదర్శన చేసిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో తెగ వైరల్ అయింది. ఆ వివాహ కార్యక్రమం లో అందరిని ఈ ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తున్నాడు. ఆ సందర్భం లో అతిథులందరూ కలిసి డాన్స్ చేస్తున్న వీడియోని ఈ ఫోటో గ్రాఫర్ వీడియో తీస్తుండగా వాళ్ళతో కలిసి రిథిమాటిక్ స్టెప్స్ తో అడగకొట్టాడు. డాన్స్ చేసే సమయం లో అతను కెమెరాను బాలన్స్ చేస్తూ తనదైన స్టైల్ లో డాన్స్ ని అదరగొట్టి మల్టీ టాలెంటెడ్ గా నిలిచాడు.
ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. అదిరి పోయే స్టెప్పులు వేస్తూ అందరి మెప్పును పొందాడు. బంధువులతో కలిసి చిందులు వేసిన వీడియో ఫుల్ వైరల్ గా మారింది. ఇంటర్నెట్ లో పంజాబీ బీట్స్ (Punjabi Beats)కి తగ్గట్టుగా చేసిన ఈ ఫోటోగ్రాఫర్ డాన్స్ వీడియో సోషల్ మీడియా లో రెండు రోజుల్లోనే దాదాపు 2,00,000 వీక్షకులను పొందింది. ప్రసిద్ధి చెందిన అబీర్ అరోరాా (Abeer Arora) యొక్క పంజాబీ ట్రాక్ ” లాంగ్ మేరే లష్కరే” కి వినోదాత్మకంగా మరియు ఎనర్జెటిక్ గా తన నృత్యాన్ని ప్రదర్శించి అందరి హృదయాలను ఆకట్టుకున్నాడు.
ఒక చేతిలో కెమెరాతో పిక్స్ తీస్తూ కాళ్లతో దుమ్ములేపే స్టెప్స్ వేస్తూ అందరి చూపు తన వైపుకు తిప్పికొన్నాడు.పెళ్లి లో ఉండే సందడికి ఈ కెమరామెన్ వేసే డాన్స్ తో ఆ సందడిని మరింత రెప్పింపు చేసాడు.
if your wedding camera man ain’t doing this …..ask for refund pic.twitter.com/UGOwDdedi5
— Punjabi Touch (@PunjabiTouch) August 14, 2023
వీడియోను చూసినట్లు అయితే పాటకు తగినట్టుగా తన నృత్య ప్రదర్శన ఉంది. అతిథులతో కలిసి తాను కూడా బంధువుగా మారిపోయి చిందులు వేసాడు.
ఈ వీడియో పై నెట్టింట నెటిజన్లు (netizens) వివిధ రకాలుగా స్పందించారు. ఎంతో ఉత్సాహంగా అతని చేసిన డాన్స్ ని పొగిడారు.మరియు అతని తీసిన ఫోటో లను చూడాలని మరికొందరు కామెంట్ చేసారు. ఇంకొందరు ఫోటోగ్రాఫర్ ఆధార్ కార్డు కు అర్హులు అని కామెంట్ చేసారు.