ఈ మధ్యకాలంలో చాలామందిని బాధిస్తున్న చర్మ సమస్యలలో మంగు మచ్చలు (Dark spots) ఒకటి. ముఖం ఎంత అందంగా ఉన్న ముఖంపై మంగు మచ్చలు లేదా పిగ్మెంటేషన్ ఉన్నట్లయితే అంద విహీనంగా కనిపిస్తుంది.
ఈ మంగు మచ్చల వల్ల చాలామంది బాధపడుతుంటారు. ఇవి అంత త్వరగా పోవు. ఈ మంగు మచ్చలు వల్ల కొంతమంది మానసికం (mental) గా కూడా కృంగి పోతుంటారు శరీరంలో మెలనిన్ ఎక్కువై ఐరన్ తగ్గినప్పుడు పిగ్మెంటేషన్ సమస్య మొదలవుతుంది.
కొందరికి వంశ పారంపర్యం (Family tradition) గా కూడా వస్తుంది. మరికొందరికి ఎండ వల్ల అనగా ఎక్కువ సేపు ఎండలో పనిచేసే వారికి ముఖంపై ఈ మంగు మచ్చలు వస్తుంటాయి. ఈ మంగు మచ్చలు కొందరికి ముక్కుపై, చెంపల పై మరి కొంతమందికి ముఖమంతా వస్తుంటాయి.
ముఖంపై మంగు మచ్చల సమస్యతో బాధపడేవారు కొన్ని పదార్థాలను ఉపయోగించి వాటిని ప్రతిరోజూ ముఖంపై అప్లై చేయడం వలన మంగు మచ్చలను తొలగించుకోవచ్చు.
ఈరోజు కథనంలో కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాం.
పచ్చిపాలు:
ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు సహజంగా ఉంటాయి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఒక గిన్నెలో పచ్చి పాలను తీసుకొని దానిలో దూదిని ముంచి ముఖంపై మంగు మచ్చలు ఉన్న దగ్గర రాయాలి. ఈ విధంగా రోజుకు రెండుసార్లు చేయాలి. ప్రతిరోజు చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోయి, ముఖం మృదువు (soft) గా మరియు కాంతివంతంగా మారుతుంది.
కలబంద:
ముఖంపై మొటిమలు మరియు మచ్చలు ఉన్నవారు కలబంద గుజ్జును ముఖం పై అప్లై చేయాలి. కలబంద హైపర్ పిగ్మెంటేషన్ ను నిర్మూలించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మంగు మచ్చలు ఉన్న దగ్గర కలబంద గుజ్జును అప్లై చేయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల త్వరలోనే మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకనగా కలబంద చర్మ సమస్యలకు సహజ ఔషధం (Natural medicine) గా పని చేస్తుంది
రాత్రి పడుకునే ముందు కలబంద గుజ్జులో, విటమిన్- ఇ క్యాప్సిల్ ఆయిల్ ను కలిపి ముఖానికి అప్లై చేసి సున్నితంగా మర్దనా చేయాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేయడం వలన ముఖంపై ఉన్న అన్ని మచ్చలు తొలగిపోతాయి.
Also Read : Face Pack : పాలు, తేనెలతో పాలుగారే ముఖం మీ సొంతం
బొప్పాయి:
బొప్పాయిలో పపైన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. బొప్పాయి రసాన్ని ప్రతిరోజు ముఖంపై అప్లై చేసి, పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా ప్రతిరోజు చేయడం వలన మచ్చలు లేని ముఖం మీ సొంతం అవుతుంది.
బంగాళదుంపలు:
బంగాళదుంప లలో కాటెకోలేస్ ఉంటుంది. ఇది ముఖానికి ఒక బ్లీచ్ లో పనిచేస్తుంది. బంగాళదుంప రసాన్ని ముఖంపై అప్లై చేయడం వలన ముఖంపై ఉన్న మొటిమలు, నల్లమచ్చలు తో పాటు ఇతర అనేక సమస్యలను నివారిస్తుంది. వారంలో రెండు లేదా మూడుసార్లు బంగాళదుంప రసాన్ని అప్లై చేయడం వలన ముఖంపై ఉన్న మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది.
కాబట్టి ముఖంపై మంగు మచ్చలు లేదా ఇతర మచ్చలు ఉన్నవారు తరచుగా ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా ముఖంపై ఉన్న అన్ని రకాల మచ్చలను మరియు మొటిమలను సులభంగా తొలగించుకోవచ్చు.