Placement Drive In Chittoor: మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారా? ఎంత చదివిన ఫలితం ఉండట్లేదా! ఇంతకీ మీరు ఏ జాబ్స్ చేయాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పే ఒక అద్భుతమైన వార్త మీ కోసం. మీరు దీన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ వార్త చాలా మంది నిరుద్యోగులకు ఊరటనిస్తుంది.
పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులు పూర్తి చేసిన నిరుద్యోగ యువతులు మరియు యువకులకు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పవచ్చు. కొంతమంది వివిధ కారణాల వల్ల చదువును మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. ఇంకా నేర్చుకునే అవకాశం ఉన్నా, చదువుకోవడానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. చాలా మంది యువతీ, యువకులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలాంటి వారికి సొంత జిల్లాలో కెరీర్ అవకాశాలు ఉన్నాయి.
Placement Drive In Chittoor Sudha Degree College
రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కేంద్రంలోని విజ్ఞాన సుధ డిగ్రీ కళాశాలలో ఈ నెల 15న ప్రాంతీయ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షణ్ముఖన్ షకిలీ తెలిపారు. కలెక్టరేట్‌లో స్వయంగా కలెక్టర్ జాబ్ మేళా పోస్టర్లను ప్రదర్శించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఉపాధి మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలు అర్హులైన నిరుద్యోగులకు జాబ్ మేళా సమాచారాన్ని అందించాలి. దాదాపు వంద కంపెనీలు పాల్గొంటాయని ఆయన భావిస్తున్నారు. ఉద్యోగం కోసం వెతికే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఈ జాబ్ మేళ (Job Mela) లో పాల్గొనేవారు తప్పనిసరిగా 10వ తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఫెయిల్ అయి పర్లేదు. వయస్సు 18 మరియు 35 సంవత్సరాల మధ్య ఉండాలి. కాబట్టి మీరు కేవలం పది చదివినా కూడా ఈ జాబ్ మేళకు హాజరు కావచ్చు. జాబ్ మేళాకు సంబంధించిన మరింత సమాచారం కోసం 9063561786 లేదా 9493210966 నంబర్లలో సంప్రదించవచ్చు.ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పట్టు అభివృద్ధి అధికారి శ్యామోహన్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్, తదితరులు పాల్గొన్నారు.