playables youtube game: యూట్యూబ్ లో గేమ్స్ ఆడుకోవచ్చు! ప్లేయబుల్స్ ని లాంచ్ చేసిన కంపెనీ!
యూట్యూబ్ వినియోగదారులందరికీ ఇప్పుడు ప్లేబుల్స్ ఫీచర్‌కి యాక్సెస్ పొందవచ్చు. ఈ ఫీచర్ తో యూట్యూబ్‌లోనే గేమ్‌లు ఆడుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే!
playables youtube game: యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి ఫోన్ లో యూట్యూబ్ యాప్ (Youtube App) ఉంటుంది. అయితే, యూట్యూబ్ లో గేమ్స్ ఆడుకోవచ్చని మీకు తెలుసా? దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడుతెలుసుకుందాం.
యూట్యూబ్ వినియోగదారులందరికీ ఇప్పుడు ప్లేబుల్స్ ఫీచర్‌కి యాక్సెస్ పొందవచ్చు. ఈ ఫీచర్ తో యూట్యూబ్‌లోనే గేమ్‌లు ఆడుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ (Download) చేయడానికి ప్రత్యేక యాప్‌లు ఏవీ అవసరం లేదు. ప్లేబుల్స్ సర్వీస్ (playables services) ను నవంబర్ 2023లో 30 ఆర్కేడ్ గేమ్‌లతో పరియచం చేశారు. ఇది కొన్ని మార్కెట్లలో ప్రీమియం కలిగిన వారికి మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, మార్చి 28 నుండి, వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. దీన్ని ప్లే చేయడానికి మీకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ (Premium Subscription) అవసరం ఏమి లేదు.
ప్లేయబుల్స్ లైవ్ అయిన విషయాన్నీ యూట్యూబ్ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది . బ్లాగ్ పోస్ట్ లో “మీరు డైరెక్టుగా YouTubeలో ఆడుకునే ఉచిత గేమ్‌ల కలక్షన్స్” అని పేర్కొంది. ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ప్లేబుల్స్ విభాగంలో ఇప్పుడు 75 గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి.
అయితే, ఈ రోల్ అవుట్ దశలవారీగా జరుగుతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇది కొంతమంది వినియోగదారులకు ఇంకా అందుబాటులో లేదు. Android మరియు iOS వినియోగదారులకు గేమ్ ట్రే ఐకాన్ కనిపించదు. దీని బట్టి చూస్తే, దశల వారీగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
15 years of @Minecraft, 15 years of a community unlike any other 💚 #minecraft15 pic.twitter.com/UUXXb07l0x
— YouTube Gaming (@YouTubeGaming) May 28, 2024
Also Read: IRCTC Tour Package : తెలుగువారి కోసం IRCTC “పుణ్యక్షేత్ర యాత్ర”.. ధర కూడా తక్కువే..!
గేమ్ ఎలా ఆడాలి?
ఉచిత YouTube గేమ్‌లను ఆడేందుకు, మీ Android లేదా iOS డివైజ్ లో యాప్ సర్వీస్ ని డౌన్లోడ్ చేయాలి.
ఎక్స్ప్లోర్ మెనులో, ప్లేబుల్స్ ఆప్షన్ ను ఎంచుకోండి.
అందులో 75 గేమ్‌లు ఉన్నాయని యూట్యూబ్ పేర్కొంది. వీటిలో యాంగ్రీ బర్డ్స్ షోడౌన్ (Angry Birds Show Down) , వర్డ్స్ ఆఫ్ వండర్స్, కట్ ది నేమ్, టోంబ్ ఆఫ్ ది మాస్క్ (Tomb Off The Mask) మరియు ట్రివియా క్రాక్ వంటి గేమ్‌లు ఉన్నాయి.
సొంత గేమింగ్ కలెక్షన్ ను ప్రారంభించిన వీడియో స్ట్రీమింగ్ సేవల్లో యూట్యూబ్ ఒకటి. నవంబర్ 2021లో నెట్‌ఫ్లిక్స్ కూడా తన స్వంత గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేసింది. ఇందులో గ్రాండ్ తెఫ్ట్ ఆటో: ది త్రయం – ది డెఫినిటివ్ ఎడిషన్, స్ట్రేంజర్ థింగ్స్ 3: ది గేమ్ మరియు ఫుట్‌బాల్ మేనేజర్ 2024 మొబైల్ వంటి అనేక గేమ్స్ ఉన్నాయి.
యాడ్ బ్లాకర్లపై యూట్యూబ్ పని చేస్తోంది.
YouTube మరో యాడ్- బ్లాకర్లపై కూడా పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. యాడ్ బ్లాకర్లను ఉపయోగిస్తే, వారు వీడియోను పూర్తిగా ఎండ్ చేసి, చివరికి తీసుకెళ్తారు. దాంతో YouTubeకి చాలా నష్టం వస్తుంది. అందువల్ల, యూట్యూబ్ ఎల్లప్పుడూ యాడ్-బ్లాక్‌కు చెక్ పెట్టాలని చూస్తుంది.
Comments are closed.