PM Kisan 17th installement Release Date: పేద మరియు వెనకపడిన తరగతులకు ప్రభుత్వం పథకాలను మరియు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతుండగా, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
సంవత్సరానికి రూ.6,000 అందిస్తుంది. రూ.2,000 చొప్పున మూడు విడతలుగా పంపిణీ చేస్తారు, ఇప్పటివరకు 16 వాయిదాలు విడుదలయ్యాయి. ఈసారి 17వ విడత డబ్బులు కూడా విడుదల చేయనున్నారు. ఈ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పదహారవ విడత ఫిబ్రవరి 28, 2024న విడుదలైన విషయం తెలిసిందే. దాదాపు 9 కోట్ల మంది రైతులు ఈ విడతల ద్వారా ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా డీబీటీ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ చేశారు.
17వ విడత ప్రయోజనాన్ని పొందడానికి, మీరు తప్పనిసరిగా e-KYCని పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ల్యాండ్ వెరిఫికేషన్ కూడా తప్పనిసరి. మీ ఆధార్ కార్డ్‌ని మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయకపోతే, మీరు వెంటనే మీ ఆధార్ కార్డుని మీ మొబైల్ నెంబర్ కి లింక్ చేయండి.
ఒకవేళ మీరు e-KYCని పూర్తి చేయకపోతే 17వ విడత రాకపోవచ్చు. అయితే, 17 విడుదల తేదీకి సంబంధించి, ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే నిబంధనల ప్రకారం ఫిబ్రవరిలో 16వ విడతతో నాలుగు నెలలకోసారి వాయిదాలు విడుదల చేశారు. 17వ విడత జూన్ మరియు జూలై మధ్య జమ అవ్వొచ్చు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఎన్నికల కంటే ముందే 17వ విడత విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన..
యోజన పేరు | ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి యోజన |
ప్రభుత్వం/ శాఖ | భారత ప్రభుత్వం/ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ |
ప్రారంభ తేదీ | 24 ఫిబ్రవరి, 2019 |
లబ్ధిదారులు | రైతులు |
వయస్సు | 18 నుండి 60 సంవత్సరాలు |
ఇంస్టాల్మెంట్ మొత్తం డబ్బు | సంవత్సరానికి రూ.6000 |
పీఎం కిసాన్ 17వ విడత తేదీ | మే 2024 |
అధికారిక వెబ్సైటు | http://pmkisan.gov.in |
PM Kisan 17th installement Release Date