PM Kisan Mandhan Yojana : కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం..రైతులకు నెలనెలా రూ. 3 వేల పెన్షన్..

PM Kisan Mandhan Yojana

PM Kisan Mandhan Yojana : కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి ఏదో ఒక స్కీమ్ ను ప్రారంభించింది. అలానే దేశానికి వెన్నెముక అయినా రైతుల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకొచ్చింది. అయితే చాలా మంది రైతులకు తమకు ఉపయోగపడే పథకాలు చాలా ఉన్నాయని తెలియదు. రైతులు కష్టపడి శ్రమించి వృద్ధాప్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్రం ఓ పథకం తీసుకొచ్చింది. ఆ స్కీమ్ ద్వారా రైతు ప్రతి నెల రూ.3 వేల పొందవచ్చు. మరి ఆ స్కీమ్ ఏమిటి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా బడుగు బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. రైతులు మరియు నిరుపేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పుడు ప్రధాన మంత్రి కిషాన్ మన్ ధన్ (PM Kisan Mandhan Yojana) అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్థిక భద్రత పరంగా ఈ ఏర్పాటు వల్ల రైతులు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు.ఇందులో ప్లాన్ కింద నెలకు 55 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత 60 ఏళ్ల పెట్టుబడి తర్వాత, మీరు నెలకు రూ. 3 వేలు పొందుతారు.

Also Read : LIC Jeevan Utsav : ఎల్ఐసీ నుంచి అదిరిపోయే పాలసీ.. 5 ఏళ్లు కడితే చాలు జీవితాంతం గ్యారెంటీ ఆదాయం..!
ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ పథకాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పేద రైతుల కోసం అభివృద్ధి చేసింది. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల రైతులు ఈ ప్రాజెక్టులో పాల్గొనవచ్చు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు రైతులు (Farmers) మాత్రమే అర్హులు. ఈ పథకం రైతులు తమ వృద్ధాప్యంలో సంతృప్తిగా జీవించేలా చేస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ ద్వారా రైతులకు వారి వృద్ధాప్యంలో పెన్షన్ రూపంలో ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది.

PM Kisan Mandhan Yojana

రేయింబవళ్లు కష్టపడి వ్యవసాయం చేసి పిల్లలను పెంచిపెద్ద చేస్తే, వృద్దాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం లేదు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు వృద్దాప్యంలో నరకం అనుభవిస్తున్నారు. అందుకే అలాంటి తల్లిదండ్రుల కోసం ఇప్పుడు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ ప్లాన్ లో పెట్టుబడి రూపంలో డబ్బులు పెడితే వృద్ధాప్యంలో వాటిని పింఛన్ రూపంలో పొందవచ్చు.

మరియు, ప్రతి నెలా మూడు వేలు అందుకోవడానికి, అర్హత కలిగిన రైతులు వారి వయస్సు ఆధారంగా ఈ వ్యవస్థలో పెట్టుబడి పెట్టాలి. మీరు 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, నెలవారీ ఖర్చు రూ.55 అవుతుంది. అదే 30 ఏళ్ల తర్వాత రూ. 110 చెల్లించాలి. అదేవిధంగా 40 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే రూ. 220 పెట్టుబడిగా ఉంటుందని చెబుతున్నారు. అలా కడుతున్న సమయంలో మీకు ఎప్పుడైతే 60 ఏళ్లు నిండుతాయో అప్పుడు ప్రతినెలకు రూ. 3వేలు ఇస్తారు.

Also Read : Two Free Cylinders 2024: హోలీ సందర్భంగా రెండు ఉచిత సిలిండర్లు, వారికి మాత్రమే!

లబ్ధిదారులు జీవించి ఉన్నంత కాలం ఇది చెల్లుబాటు అవుతుంది. ఇలా ప్రతి నెల రూ. 3వేల అంటే, ఒక్క ఏడాదికి రూ. 36వేల వరకు అర్హుడైన వ్యక్తి అకౌంట్ లోకి పడతాయి. అర్హులైన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకొని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్ సైట్ లో చూడవచ్చు.

PM Kisan Mandhan Yojana

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in