PMAY Scheme: PMAY అర్హత మీకు వర్తిస్తుందా? ఇళ్ళు లేని వారికి కేంద్రం గూడ న్యూస్!
భారతదేశంలో ఏ ప్రాంతంలో అయిన పక్క ఇళ్ళు లేని వారికి PMAYU కింద వడ్డీ రాయితీ సబ్సిడీ రుణాలను అందిస్తుంది.దరకస్తూ ప్రాసెస్ ఇదే!
PMAY Scheme: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ మరియు పట్టణ పేదలకు అద్భుతమైన వార్తను ప్రకటించింది. పేద ప్రజల కోసం పక్కా ఇళ్ళు నిర్మించడానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం (Awas Yojana Scheme) కింద మరో 3 కోట్ల ఇళ్ల నిర్మించాలని చూస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలో జరిగిన తొలి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది.
2015-16 నుండి, అర్హులైన పేదలకు మౌలిక సదుపాయాలతో కూడిన నివాసాలను అందించాలనే లక్ష్యంతో కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను అమలు చేస్తోంది. గత పదేళ్లలో 4.21 కోట్ల ఇళ్లను పూర్తి చేసి అర్హులైన వారికి పంపిణీ చేశారు. ఇప్పుడు అదనంగా మరో మూడు కోట్ల నివాసాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సమ్మిళితం చేసి..మరుగుదొడ్లు, ఎల్‌పిజి కనెక్షన్లు (LPG Connections) , విద్యుత్తు మరియు తాగునీరు సరఫరా వంటి సౌకర్యాలు కల్పిస్తారు.
ఇది మీకు సంబంధించినదా? అర్హతలు ఏమిటి?
భారతదేశంలో ఏ ప్రాంతంలో అయిన పక్క ఇళ్ళు లేని వారికి PMAYU కింద వడ్డీ రాయితీ సబ్సిడీ రుణాలను అందిస్తుంది. ప్రభుత్వ హౌసింగ్ పథకం, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, రెండు భాగాలుగా విభజించడం జరిగినది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పట్టణ, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన రూరల్ గా విభజించారు. అర్బానా యోజన ద్వారా రుణం పొందిన వారు వడ్డీ రేటు రాయితీల నుండి ప్రయోజనం పొందుతారు. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అన్ని ఆదాయ వర్గాలకు వడ్డీ రాయితీలను అందిస్తుంది, ఇందులో EWS, LIG, మిడిల్ క్లాస్ గ్రూప్-1, మరియు మధ్య తరగతి గ్రూప్-2 కుటుంబాలు రూ.3 లక్షలు, రూ.3-6 లక్షలు మరియు వరుసగా రూ.12-18 లక్షలు పొందవచ్చు. అర్హతగల పట్టణ పేదలు గది నిర్మాణం, అభివృద్ధి మరియు విస్తరణ కోసం సబ్సిడీ వడ్డీ రేట్ల (Subsidy Interest Rate) తో గృహ రుణాలను పొందవచ్చు.
Also Read: PM Surya Ghar Muft Bijli Yojana : కేంద్రం నుండి రూ.78,000 సబ్సిడీ, ఎలా పొందాలంటే?
మీరు PMAY ద్వారా వడ్డీ-సబ్సిడీ రుణానికి అర్హత కలిగి ఉంటే, మీ బ్యాంక్ దానిని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (Housing Bank) నుండి పొందుతుంది. గరిష్టంగా రూ.12 లక్షల రుణం పొందవచ్చు. వార్షిక వడ్డీ మూడు శాతం తగ్గింది. ఉదాహరణకు, మీరు రూ.8 లక్షల రుణం పొందినట్లయితే, మీకు రూ.2.20 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ మొత్తాన్ని ముందుగా రుణం నుండి తీసివేయవచ్చు. అంటే EMI కేవలం రూ. 5.80 లక్షలు చెల్లించాలి. గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే కేంద్రం రూ.1.20 లక్షలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంచెం ఎక్కువగానే సహకరిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇస్తుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్ pmaymis.gov.in ని సందర్శించండి.
ప్రధాన ట్యాబ్ నుండి సిటిజన్ అసెస్‌మెంట్ ఎంపికను ఎంచుకోవాలి.
పేజీని తెరిచిన తర్వాత, మీ ఆధార్ కార్డ్ నంబర్ (Aadhar Card Number) ను నమోదు చేయండి.
మీ ఆధార్ కన్ఫామ్ చేసిన తర్వాత, మీరు అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
వార్షిక ఆదాయం, వ్యక్తిగత మరియు బ్యాంకు ఖాతా (Bank Account) సమాచారాన్ని అందించాలి.
మీరు మీ మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, సేవ్ బటన్‌ను క్లిక్ చేయండి.
ఆ తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ (Download) చేయండి. ఇది CSE సెంటర్ లేదా రుణం అందించే బ్యాంకులో ఇవ్వాలి.
Comments are closed.