Post Office Savings Time Deposits : ఈరోజుల్లో, పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. డబ్బు ఆదా చేయాలని మరియు ఏదైనా స్కీంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. దీని కోసం అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. సురక్షితంగా ఉండేవిధంగా చూసుకొని పెట్టుకొని పెడతారు. పోస్టాఫీసు పథకాల గురించి ప్రత్యేకంగా తెలిసి ఉండాలి.
పోస్టాఫీస్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లు
పోస్టాఫీస్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లు ఎక్కువగా ఆదరణ పొందాయి. ఎందుకంటే రిస్క్ తక్కువగా ఉంటుంది ఇంకా రిటర్న్స్ కు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. చాలా బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసులు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్‌లను అందిస్తాయి. వీటిని టైమ్ డిపాజిట్లు అంటారు.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనందున, మీరు పన్నులను ఆదా చేయడానికి మరియు మెరుగైన రాబడిని సంపాదించడానికి అనేక పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఇప్పుడు, ఈ టైమ్ డిపాజిట్ స్కీమ్ దేనికి సంబంధించినది, ఇది ఎంతకాలం కొనసాగుతుంది, వడ్డీ రేట్లు ఏమిటి మరియు రాబడిని ఎలా లెక్కిస్తారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు మరియు ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో FD పథకాలను అందిస్తుంది. వీటన్నింటికీ ప్రభుత్వ మద్దతు ఉంటుంది. రిటర్న్స్ వస్తాయి. అయితే, అన్ని పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80c ప్రయోజనాలకు అర్హత పొందవు. పోస్టాఫీసు ఐదేళ్ల కాల వ్యవధి డిపాజిట్లు మాత్రమే గరిష్టంగా ప్రతి ఆర్థిక సంవత్సరం రూ. 1.50 లక్షల పన్ను మినహాయింపుకు అర్హులు.
మీ పోస్ట్ ఆఫీస్ FD వ్యవధి తర్వాత, మీరు మీ పెట్టుబడిపై స్థిరమైన రాబడిని పొందుతారు. FD మెచ్యూర్ అయినప్పుడు, పెట్టుబడి డబ్బు మరియు వడ్డీ మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఒక సంవత్సరానికి 6.9%, రెండేళ్లకు 7%, మూడేళ్లకు 7.10% మరియు ఐదేళ్లకు 7.50% వడ్డీ అందిస్తుంది.
దీని ప్రకారం, ఐదేళ్ల కాలానికి డిపాజిట్‌పై వార్షిక వడ్డీని చెల్లిస్తుంది. కానీ వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు. ఈ పథకంలో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయాలి. గరిష్ట పరిమితులు లేవు. మైనర్‌ల తరపున గార్డియన్ ఖాతాలను తెరవవచ్చు.
సింపుల్ గా అర్ధం కావాలంటే..?
మీ పెట్టుబడి ఐదేళ్లలో ఎంత రాబడి వస్తుందో చూద్దాం. ఐదేళ్లలో 7.50 శాతం వడ్డీ రేటుతో 3 లక్షల డిపాజిట్‌పై రూ.1,34,984 పొందుతారు. మెచ్యూరిటీ సమయంలో, మీ బ్యాలెన్స్ రూ. 4,34984 అవుతుంది. ] ప్రతి రూ. 5 లక్షలు పెట్టుబడి, రూ. 2,24,974 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ సమయంలో, మీ బ్యాలెన్స్ రూ. 7,24,974 అవుతుంది. 10 లక్షల పెట్టుబడి రూ. 4,49,948. మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ. 14,49,948 అవుతుంది.
Post Office Savings Time Deposits