Telugu Mirror: రైతు దేశానికి వెన్నెముక,రైతు లేనిదే రాజ్యం లేదు,ఇవి రైతుల గురించి మాట్లాడ వలసి వచ్చినప్పుడల్లా ప్రజలు,అధికారులు,రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు..వాస్తవానికి రైతు లేనిది రాజ్యం లేదు కానీ ఆరుగాలం శ్రమించి కష్టపడిన రైతు కి సరైన ఆదరణ లేక అప్పుల పాలై జీవితాలను చాలించిన రైతులు ఉన్నారు.అలానే వృధ్యాప్యం లో ఉన్న రైతులకు ఏ విధమైన సంక్షేమ పథకాలు అందక ఆసరా లేక కొట్టు మిట్టాడే రైతులు ఎంతో మంది. కేంద్ర ప్రభుత్వంలో వారికోసం ఉన్నటువంటి ఒక పధకం గురించి తెలుసు కుందాం.
రైతుల సంక్షేమం కోసం ప్రస్తుత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా నిలుస్తున్నాయి.తెలంగాణ(Telangana) ,ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పధకాలు రైతులు వ్యవసాయం చేసిన కాలానికి మాత్రమే అండగా నిలుస్తాయి.కానీ వారు వృధ్యాప్యం లోకి వచ్చిన తరువాత ఏ విధమైన ఆర్ధిక ఆసరా లభించడం లేదు.ఇటువంటి సమయంలో వయసు మళ్ళిన చిన్న,సన్న కారు రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం “ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (PMKMY ) ” అనే పేరుతో సామాజిక భద్రత పధకాన్ని అమలు చేస్తుంది. ఈ పధకం కింద 60 సంవత్సరాలు నిండిన రైతులు పింఛన్ పొందవచ్చు.ఈ పధకం కింద నెలకు కనీసం రూ.3 వేల పింఛన్ అందుతుంది. ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పధకానికి సంభంధించిన వివరాలను తెలుసుకుందాం.
PMKMY పధకం:
ఈ పధకం 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన రైతులు మాత్రమే అర్హులు.భారత దేశం లోని వివిధ రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డులలో పేర్లు నమోదై ఉండి 2 హెక్టార్ ల సాగు భూమిని కలిగి ఉన్న చిన్న,సన్న కారు రైతులందరూ ఈ పధకం లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.కానీ వారికి పింఛన్ మాత్రం 60 సంవత్సరాలు నిండిన తరువాత మాత్రమే అందుతుంది.
PMKMY పధకం క్రింద అర్హత లేని వారు:
జాతీయ పెన్షన్ పధకం (ఎన్ పీ ఎస్),ESI స్కీమ్,EPFO పరిధిలోకి వచ్చేవారు,ఏవైనా ప్రభుత్వ పరిధి లోకి వచ్చే సామాజిక భద్రతా పధకాల పరిధిలోకి వచ్చే వారు.ప్రభుత్వ ఉద్యోగులు,ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు ‘ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్'(Pradhan Mantri Kisan Maandhan Yojana) పింఛన్ పొందడానికి అనర్హులు.
ప్రీమియం చెల్లింపులు:
ఈ పధకం లో చేరిన రైతులు వారికి 60 సంవత్సరాల వయసు నిండేవరకు ప్రీమియం చెల్లించ వలసి ఉంటుంది.60 ఏళ్ళు నిండిన తరువాత ప్రతినెలా రూ.3 వేల పింఛన్ అందుతుంది.పధకం లో చేరేవారి వయసు ఆధారంగా ప్రీమియం ఉంటుంది.రైతు ఎంత మొత్తం చెల్లిస్తాడో ప్రభుత్వం కూడా అంతే మొత్తం తన వంతు వాటాగా కలిపి భీమా కంపెనీకి చెల్లిస్తుంది.ఉదాహరణకు 18 సంవత్సరాల రైతు తనవాటా గా నెలకు రూ.55 చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తనవంతు వాటాగా రూ.55 ను కలిపి భీమా కంపెనీకి మొత్తం రూ.110 చెల్లిస్తుంది.18 సంవత్సరాల రైతుకి ప్రీమియం రూ.55 ఉండగా ప్రతి సంవత్సరం వయస్సును బట్టి రూ.3 నుంచి, రూ.10 వరకు ప్రీమియం పెరుగుతుంది. 40 సంవత్సరాల వారికి రూ.200 ప్రీమియం ఉంటుంది.
రైతు మరణిస్తే పింఛను ఎవరికి?
PMKMY పధకం లోని రైతు మరణిస్తే రైతు యొక్క జీవిత భాగస్వామి పధకాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.60 ఏళ్ళు నిండిన తరువాత రూ.3 వేల పింఛన్ అందిస్తారు.ఒకవేళ వయసు 60 ఏళ్ళు నిండిన తరువాత రైతు మరణిస్తే జీవిత భాగస్వామికి సగం పింఛన్ ను ఇస్తారు.పధకాన్ని కొనసాగించేందుకు రైతు తన వాటా ప్రీమియంను నిర్ణయించిన తేదీ ప్రకారం చెల్లించాలి.ఈ పధకం పూర్తిగా స్వచ్ఛందం.
పధకం లో చేరేందుకు అవసరమైన పత్రాలు:
రైతులు కామన్ సర్వీస్ కేంద్రాలలో తమ పేర్లను ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.రైతు ఫోటో,నివాస ధృవీకరణ పత్రం,ఆదాయ ధృవీకరణ పత్రం,వయసు నిర్ధారణ,సాగు భూమి,ఆధార్ మరియు ఇతర అవసరమైన పత్రాలను ఆన్ లైన్ చేయాలి.కేంద్ర ప్రభుత్వం అన్ని వివరాలను PMKMY పోర్టర్ లో నమోదు చేసిన తరువాత రైతుకు సమాచారం వస్తుంది.రైతు పేరు మీద ప్రత్యేకమైన పింఛన్ ఖాతాను తెరచి కార్డ్ అందిస్తారు.