PM Mudra Yojana : వ్యాపారం (Bussiness) చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు వ్యాపారం మొదలుపెట్టాలని ఆశతో ఉంటారు. అయితే ఆర్థికంగా ఇబ్బందులు వ్యాపారానికి కావాల్సిన నిధులు లేకపోవడంతో వెనుకడుగు వేస్తుంటారు. లోన్ కోసం చూస్తుంటారు. అయితే బ్యాంకులు వసూలు చేసే అధిక వడ్డీకి భయపడి కూడా వెనుకడుడు వేస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం జాతీయ ప్రభుత్వం మంచి పథకాన్ని తీసుకొచ్చింది.
జాతీయ ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజనను (PM Mudra Yojana )ప్రవేశ పెట్టి చాల సంవత్సరాలు అవుతుంది కానీ ఈ పథకం గురించి ఎవరికీ అవగాహన లేదు. ఈ పథకంతో వ్యాపారం చేయాలనుకునే వారికి రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఈ లోన్ పొందడానికి ఎలాంటి సెక్యూరిటీ పేపర్లు అవసరం లేదు. ఎలాంటి షరతులు లేకుండా రుణం పొందే అవకాశాన్ని కల్పించారు.
Also Read : Raithu Barosa 10 Days: పది రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల, ఇదిగో వివరాలు ఇవే!
ముద్రా యోజన రుణాలు (PM Mudra Yojana Loans)మూడు రకాలుగా అందించబడతాయి. మొదటిది శిషు రుణం. ఈ కేటగిరీలో, రూ. 50 వేలు వరకు లోన్ మంజూరు చేస్తారు. రెండవ ఎంపిక కిషోర్ లోన్, ఇది రూ. 5 లక్షలు వరకు లోన్ ను అందిస్తుంది. మూడవ ఎంపిక తరుణ్ రుణం, ఇది పది లక్షల రూపాయల వరకు రుణాలను అందిస్తుంది. వ్యాపారాన్ని బట్టి లోన్ అమౌంట్ మారుతుంది.
ముద్రలోన్ యోజన కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి ముందుగా భారతీయ పౌరుడిగా (Indian Citizen) ఉండాలి. ఇంకా, మునుపటి బ్యాంక్ రుణం కట్టని చరిత్ర ఉండకూడదు. దరఖాస్తుదారుడి వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాలు ఉండాలి. ఈ లోన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదు. రుణం తీసుకున్న తర్వాత ఒకటి నుంచి ఐదేళ్లలోపు తిరిగి చెల్లించవచ్చు.
5 సంవత్సరాలలోపు తిరిగి చెల్లింపు పూర్తి కాకపోతే, అది అదనపు కాలానికి పొడిగించబడవచ్చు. రుణానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వ్యాపార చిరునామాకు సంబంధించిన ఆధారాలు, ఐటీ రిటర్న్‌ల కాపీ, సెల్ఫ్ ట్యాక్స్ రిటర్న్ మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవసరం. మరింత సమాచారం కోసం మరియు లోన్ కోసం దరఖాస్తు చేయడానికి, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read : May 13 Holiday: తెలంగాణలో మే 13న వేతనంతో కూడిన సెలవు
ఈ ముద్ర యోజన కోసం బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు వంటి వాటిని ఆశ్రయించొచ్చు. వాణిజ్య బ్యాంకులు, RRBలు, కోఆపరేటివ్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఈ తరహా లోన్లు అందిస్తున్నాయి.