Telugu Mirror: రేపటి నుండి గ్రామపంచాయతీ (gram panchayat) , మున్సిపాలిటీ (Municipality) లో జరగనున్న ప్రజా పాలన (Praja Palana) సదస్సుకు అన్ని ఏర్పాట్లు రాష్ట్రమంతా పూర్తయ్యాయి, సభ వద్ద అధికారులు కావాల్సిన వసతులన్నీ సమకూర్చారు, ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ను ఉండేటట్టు ఏర్పాటు చేశారు, ఇప్పటికే అభ్యర్థులు రేపు కౌంటర్ వద్ద సమర్పించవలసిన దరఖాస్తు ఫారంని విడుదల చేశారు, దరఖాస్తు ఫారంలో అభ్యర్థులు ఇచ్చే సమాచారం ఆధారంగానే అధికారులు దరఖాస్తుదారుడు పథకాలకి అర్హుడా లేదా అనేది నిర్ణయిస్తారు,
ధరఖాస్తుని మొత్తం రెండు విభాగాలుగా విడదీశారు, మొదటి విభాగంలో అభ్యర్థి వ్యక్తిగత వివరాలు పూర్తి చేయాల్సి ఉంది.
1) దరఖాస్తుదారుడు పేరు ఆధార్ కార్డు (Aadhaar Card) ప్రకారం నమోదు చేయాలి
2)దరఖాస్తుదారుడు కొడుకు అయితే తండ్రి పేరు, భార్య అయితే భర్త పేరు నమోదు చేయాలి
3) లింగం
4) కులం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనారిటీ
5) ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీని రాయాలి
6) ఆధార్ నెంబర్ నమోదు చేయాలి
7) మీ మొబైల్ నెంబర్
8) రేషన్ కార్డు నెంబర్
9) మీ ఇంటి అడ్రస్
ఇవి మొదటి విభాగంలో మనం పూర్తి చేయాల్సిన సమాచార వివరాలు, ఇంకా రెండవ విభాగంలో వచ్చేసి
మొదటిగా మహాలక్ష్మి పథకాని (Mahalakshmi scheme) కి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసి ఉంటుంది
1) మీ గ్యాస్ యొక్క కనెక్షన్ నెంబర్
2) మీకు గ్యాస్ పంపిణీ చేస్తున్న కంపెనీ పేరు
3) మీకు సుమారుగా సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు కావాల్సి ఉంటుంది.
రెండవది ఉద్యమకారులకు కోసం కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లు పథకం (indiramma housing scheme) గురించి కొన్ని ప్రశ్నలు
1) అభ్యర్థులు మొదటగా వారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నార లేదా అని తెలియజేయాలి
2) ఒకవేళ పాల్గొన్నట్లయితే సంబంధిత కేసు సంఖ్య మరియు తేదీని నమోదు చేయాలి
3) అదేవిధంగా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లినట్టు అయితే జైలుకు సంబంధించిన వివరాలు అనగా జైలు పేరు జైలు స్థలం శిక్ష సంబంధిత వివరాలు మరియు ఎంతకాలం మీకు శిక్ష పడింది అన్న వివరాలు
మూడవది గృహజ్యోతి (gruha jyothi scheme) కి సంబంధించిన వివరాలు
ఇక్కడ మీరు మీ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యని నమోదు చేయాల్సి ఉంటుంది
నాలుగవది చేయూత పథకాని (cheyutha scheme) కి సంబంధించిన ప్రశ్నలు
చేయూత పథకంలో మొత్తం 11 క్యాటగిరీలని ప్రభుత్వం ఎంపిక చేసింది ఇందులో మీరు ఏ క్యాటగిరి కి చెందుతారో తెలియజేయాల్సి ఉంటుంది
ఎంపిక చేసిన కేటగిరీలు
1) వికలాంగుల
2) వృద్ధాప్య
3) గీత కార్మికులు
4) డయాలసిస్ బాధితులు
5) బీడీ కార్మికుల జీవన భృతి
6) ఒంటరి మహిళ జీవన భృతి
7) వితంతు
8) చేనేత కార్మికులు
9) ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల
10) పైలేరియా బాధితులు
11) బీడీ టేకేదారు జీవన భృతి
దరఖాస్తు ఫారం తో పాటు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్, గ్యాస్ కనెక్షన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మీరు ఉద్యమకారులు అయితే కేసు నమోదైన FIR కాపీ దానికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా చేయూత పథకంలో మీ కేటగిరికి సంబంధించిన డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.