Premalu OTT : ఇటీవల విడుదలైన ప్రేమలు (Premalu) అనే చిన్న సినిమా సంచలనం సృష్టించింది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ యూత్ కంప్లీట్ ఎంటర్ టైనర్ (Entertainer) తెలుగు ప్రేక్షకులను కూడా థ్రిల్ చేసింది. హైదరాబాదు నేటివిటీ నేపథ్యంలో సాగే ప్రేమకథ కావడంతో యువతరం ఈ చిత్రాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో చిత్ర నిర్మాత రాజమౌళి తనయుడు కార్తికేయ విడుదల చేయడం గమనార్హం.
స్లీన్, మమితా బైజు హీరోయిన్లుగా నటించిన ప్రేమలు చిత్రానికి గిరీష్ ఎడి దర్శకత్వం వహించారు. కేవలం 10 కోట్లతో మొదలైన ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రేమలు చిత్రం OTT విడుదల తేదీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అయిన డిస్నీ ప్లస్, హాట్ స్టార్ ప్రేమలు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఆహా (Aha) తెలుగు వెర్షన్ హక్కులను సొంతం చేసుకుంది.
ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఏప్రిల్ 12 నుండి OTT వీక్షణకు అందుబాటులో ఉంటుంది. మలయాళం, తమిళం, కన్నడ మరియు మలయాళం వెర్షన్‌లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో (Disney Plus HotStar), తెలుగు వెర్షన్ ఆహాలో అందుబాటులో ఉంటాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
రెండు వారాలు ఆలస్యంగా స్ట్రీమింగ్..
మొదట్లో, ప్రేమలు చిత్రం OTTలో మార్చి 29 నుండి అందుబాటులో ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు, ఈ చిత్రం రెండు వారాల తర్వాత డిజిటల్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని భావా స్టూడియోస్ లేబుల్‌పై ఫహద్ ఫాజిల్, దిలీప్ పోతన్ మరియు శ్యామ్ పుష్కరన్ కలిసి నిర్మించారు. మాథ్యూ థామస్, శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, అల్తాఫ్ సలీం, షమీర్ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. విష్ణు విజయ్ సంగీతం సమకూర్చారు.