Make Up Tips : మేకప్ వేసుకునే ముందు మీ చర్మాన్ని ఇలా సిద్ధం చేసుకోండి..

Telugu Mirror : మానవ చర్మం వివిధ రకాలుగా ఉంటుంది. కొంతమంది పొడి చర్మం కలవారు ఉంటారు. వారు కొన్ని మేకప్ టిప్స్ ఉపయోగించడం వలన పర్ఫెక్ట్ లుక్(Perfect Look) కలిగి ఉంటారు.ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు మేకప్ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మేకప్ వేసుకోవడం మహిళల జీవితంలో ఒక భాగం అయినది. మేకప్ వేసుకున్న తర్వాత అమ్మాయిల్లో ఆత్మ విశ్వాసం బాగా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మేకప్(Make Up) వేసేటప్పుడు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల మీ లుక్ మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి‌.

ToDay Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈ రోజు సోమవారం, జూలై 17, 2023 తిథి ,పంచాంగం

మేకప్ వేసుకునేటప్పుడు వారి చర్మ తత్వాన్ని బట్టి మేకప్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పేరున్న మేకప్ ఆర్టిస్టులు సలహా ఇవ్వడానికి ఇదే కారణం. జాగ్రత్తలు తీసుకోకపోతే మేకప్ సమస్య తప్పదు. చర్మ తత్వాన్ని బట్టి చర్మానికి మేకప్ చేయడానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.మేకప్ చేసుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు చూద్దాం. మీ చర్మం పొడి చర్మం అయితే ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీ మేకప్ ను పర్ఫెక్ట్ లుక్ గా మార్చుకోవచ్చు.

పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేయడం వలన మీ చర్మం పొడిబారకుండా మరియు కాంతివంతంగా కనిపించేలా ఉంటుంది. దీనికోసం ముందుగా ఫేస్ వాష్(Face Wash) చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసిన తరువాత స్కిన్ పై మాయిశ్చరైజర్(Moisturizer) రాయాలి. ఇది మీ చర్మం లో తేమను ఆపుతుంది. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత వెంటనే మేకప్ వేయకూడదు. నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఆగాలి. అప్పుడు మాయిశ్చరైజర్ చర్మంలో ఇంకిపోతుంది. దీని తర్వాత మేకప్ వేసుకోవడం తేలిక అవుతుంది.

Tamil Star Hero : తలపతి విజయ్ చూపు చదువుల వైపు..

పొడి చర్మం(Dry Skin) ఉన్నవారు తప్పకుండా సీరం అప్లై చేయాలి:

మేకప్ వేసుకునే ముందు ఫేస్ పై కొంచెం సీరం అప్లై చేస్తే స్కిన్ మెరుస్తుంది. సీరం కొనేటప్పుడు బెస్ట్ సీరం ఎంచుకోవాలి. అప్పుడు మేకప్ వేసుకునేటప్పుడు ఫౌండేషన్ మంచిగా ఉంటుంది. మీ చర్మం ఆయిలీగా ఉంటే మీ చర్మానికి క్రీం లేదా ఆయిల్ కి సంబంధించిన ఫౌండేషన్ మాత్రమే సరైనదని గుర్తించుకోవాలి. ఇది మీ ఫేస్ లో కాంతిని అలాగే ఉంచుతుంది.
ఐషాడో ఉపయోగించడం: పొడి చర్మంపై పౌడర్ ఆధారిత ఐషాడో విచిత్రంగా కనిపిస్తుంది. క్రీమ్ ఆధారిత ఐషాడో ఉపయోగించాలి.

లిప్ స్టిక్(Lipstick) కొనేటప్పుడు ఈ విషయాన్ని గుర్తించుకోండి:

మీ పెదవులు డ్రై గా ఉంటేనిగనిగలాడే లిప్ స్టిక్ ని ఉపయోగించండి. లిప్ స్టిక్ ను కొనేటప్పుడు అది మ్యాట్ గా అంటే డల్(నిర్జీవంగా లేదా లైట్) గా ఉండకూడదని గుర్తుపెట్టుకోండి. ఇటువంటి కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల డ్రై స్కిన్ వాళ్లకు కూడా మేకప్ గుడ్ లుక్ ని తెస్తుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in