Pushpa 2 Movie : త్రిశూలంతో పుష్పరాజ్.. కళ్లతోనే భయపెడుతున్న అల్లు అర్జున్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో అల్లు అర్జున్ త్రిశూలం పట్టుకొని, శంఖం ఊదుతూ కనిపిస్తున్నాడు.

Pushpa 2 Movie : రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రిలీజ్ చేసిన శ్రీవల్లి పోస్టర్ (Srivalli poster) అద్భుతంగా ఉంది. అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8న పుష్ప 2 ట్రైలర్‌ను (Pushpa 2 trailer) విడుదల చేయనున్నారు. మేకర్స్ ఇప్పటికే ఈ అంశంపై అధికారిక ప్రకటన చేశారు. ఈ క్రమంలో పుష్ప 2 ప్రమోషన్స్ మొదలయ్యాయి. రోజుకో సినిమా అప్ డేట్స్ షేర్ చేస్తూ అంచనాలను పెంచుతున్నారు.

ప్రస్తుతం మోస్ట్ యాంటిసిపేట్ మూవీ (Most anticipated Movie) పుష్ప 2 (Pushpa 2). గతంలో సంచలనం సృష్టించిన పుష్పకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ సెన్సేషన్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటివరకు కేవలం బన్నీ పోస్టర్, చిన్న గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఈ రష్మిక పుట్టినరోజు సందర్భంగా శ్రీవల్లి పోస్టర్ ను రిలీజ్ చేసారు. అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8న పుష్ప 2 ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ రివీల్ చేశారు.

Pushpa 2 Movie

ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో పుష్పరాజ్ (Pushparaj) అమ్మవారి గెటప్‏లో కనిపిస్తుండగా, ఒక చేత్తో త్రిశూలం పట్టుకుని, మరో చేతిలో శంఖం ఊదుతున్నట్లు కనిపించాడు. ఇక బన్నీ ముఖం కనిపించకుండా పూర్తిగా కుంకుమతో నింపేశారు. ఆ పోస్టర్ లో బన్నీ కళ్లు ఎరుపెక్కి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.

ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు వరుస పోస్టర్లతో ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా రిలీజ్ అయిన పుష్పరాజ్ ఉగ్రరూపంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు.

అయితే ఏప్రిల్ 8న టీజర్‌లో ఈ బీజీఎం వినబడుతుందని చిత్రయూనిట్ ధృవీకరించింది. పుష్పకు దేవి సంగీతం అందించిన విధానం ఎంత విజయవంతమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అదే మ్యాజిక్ పుష్ప 2 చిత్రానికి రీక్రియేట్ చేయనుందని అంటున్నారు.ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Pushpa 2 Movie

 

Comments are closed.