Telugu Mirror : భారతదేశంలో ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ప్రయాణించడం చాల సులభమైన విషయం. కానీ తప్పనిసరి పరిస్థులలో సొంత వాహనాన్ని కూడా మరొక రాష్ట్రాన్ని బదిలీ(transfer) చేయాలి అంటే మళ్ళీ ఆ రాష్ట్రము లో కూడా ఆ వాహనాన్ని నమోదు చేయడం ముఖ్యం. ఒక వాహనాన్ని తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెంబర్ ప్లేట్(Number Plate) లు జారీ చేస్తారు. అయితే రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ BH సిరీస్ ను ఇటీవలే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ప్రారంభించింది.
శామ్సంగా మజాకా.. దుమ్ము రేపుతున్న Samsung.. రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్ లు..
BH నెంబర్ ప్లేట్ అనగానేమి?
BH సిరీస్ అనగా వాహనం భారత దేశానికి చెందిందని అని అర్ధం. అంటే ఇది ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించింది కాదు. దేశ వ్యాప్తంగా చెల్లబాటు అవుతుంది అని అర్ధం.కానీ ఇది కొత్తగా వచ్చిన వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ BH సిరీస్ నెంబర్ ప్లేట్ లను తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఒక రాష్ట్రము నుండి మరొక రాష్ట్రానికి బదిలీ అయ్యే సమయం లో కొత్తగా మళ్ళీ పత్రాలు , పేపర్ లు రెడీ చేసుకొని మళ్ళీ రెజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ BH సిరీస్(BH series) వల్ల మరొక రాష్ట్రానికి వెళ్లిన కూడా RTO కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ అవకాశాన్ని ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు 1, వ్యాపార, ప్రభుత్వ విభాగానికి చెందిన వారు వినియోగించుకోవచ్చు.
BH సిరీస్ నంబర్ ప్లేట్ గురించి తెలుసుకోండి :
BH సిరీస్ నంబర్ ప్లేట్ సెప్టెంబర్ 15, 2021 లో ప్రారంభించగా నమోదు చేయడానికి ఆన్ లైన్ ప్రక్రియను ఉపయోగించాలి.అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయడానికి parivahan.gov.in ని ఉపయోగించండి. అయితే డిజిల్ తో నడిచి వాహనాలకు అదనంగా 2 % ఫీజు ను విధిస్తారు. భారత సిరీస్ నెంబర్ ప్లేట్ సాధారణంగా YY BH #### XX తో ఉంటుంది.ఇందులో YY అనగా రిజిస్ట్రేషన్ నమోదు చేసిన సంవత్సరం, BH అనగా భారత సిరీస్ , #### అనగా రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు XX అంటే సెగ్మెంట్ నెంబర్ ( I , O కాకుండా AA నుండి ZZ వరకు ). ఈ దరఖాస్తు పని డిజిటల్ గానే పూర్తి అవుతుంది.
TVS Rider 125 : హీరో లుక్ తో సూపర్ స్క్వాడ్ ఎడిషన్..తక్కువ ధరతో అధిక ఫీచర్స్..
BH సిరీస్ నంబర్ ప్లేట్ కోసం నమోదు చేసుకునే ప్రక్రియ :
కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు, అధికారిక పోర్టల్ ను సందర్శించి డీలర్(dealer) సహాయంతో ఫారం 20ని నింపాలి. 4 రాష్ట్రాలలో ప్రైవేట్ విభాగంలో పని చేసే ఉద్యోగులు కచ్చితంగా 60 ఫారంను పూర్తి చేసి, ప్రైవేట్ ఉద్యోగుల వర్కింగ్ సర్టిఫికేట్లను సమర్పించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవ్వగానే ఆ వాహనానికి BH సిరీస్ నెంబర్ ప్లేట్ ను తెలుపు మరియు నలుపు లో జారీ చేస్తారు .
BH నెంబర్ ప్లేట్ కోసం ఎటువంటి రుసుము(Fee)ని దరఖాస్తు చేసే సమయం లో చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని ఉచితంగా వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ రిజిస్ట్రేషన్ సమయం లో మాత్రం దరఖాస్తుదారులు 2 సంవత్సరాలుగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనం రూ. 20 లక్షలకు మించి ఉంటె 12 % పన్ను చెల్లించాలి. రూ. 10 లక్షల లోపు వాహనం ధర ఉంటె 8 % పన్ను చెల్లించాలి మరియు వాహనం ధర రూ.10 లేదా రూ.20 లక్షల మధ్య ఉంటె 10 % చెల్లించాల్సి ఉంటుంది.