Telugu Mirror: ప్రతి ఒక్క మహిళ మేకప్ వేసుకోవడానికి ఇష్టపడుతుంది .ఫంక్షన్లకు లేదా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు స్త్రీలు ఇంకా ఎక్కువ అందంగా కనిపించడానికి మేకప్ చేసుకుని రెడీ అవుతుంటారు.
ఉద్యోగ రీత్యా లేదా బయట వృత్తి పనుల మీద బయటకు వెళ్ళే స్త్రీలకు కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్(Beauty Products)గురించి తెలియజేస్తున్నాం .ఇవి బయటకు వెళ్లి పని చేసే మహిళల హ్యాండ్ బ్యాగ్(Hand Bag)లో ఉండడం అవసరం .వర్కింగ్ ఉమెన్ అనుకోకుండా ఫంక్షన్స్ కి లేదా ఎక్కడికైనా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయి .ఇవి మార్కెట్లో సులభంగానే లభిస్తాయి .
Also Read:Youtube Treatment: యువకుడి ప్రాణం తీసిన యూట్యూబ్ వైద్యం
స్త్రీలు ఆఫీస్ పని అయిన తర్వాత అలసిపోయినట్లు కనిపిస్తారు. ఆ సమయంలో అనుకోకుండా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు సులభంగా రెడీ అవ్వడానికి ఇప్పుడు మేము చెప్పబోయే ప్రోడక్ట్స్ ని, మీ బ్యాగులో ఎప్పుడూ ఉంచుకున్నట్లయితే హ్యాపీగా ఎక్కడికైనా వెళ్లవచ్చు. అవి ఏమిటో చూద్దాం.
కాటుక(Katuka):
కళ్ళకు కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళ అందం చాలా రెట్టింపు అవుతుంది .కళ్ళు అలిసిపోయినట్లుగా కనిపించవు. ఐ లైనర్ లాగా కాటుకుని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మీ బ్యాగ్ లో ఉండేలా చూసుకోండి.
బిబి క్రీమ్(BB Cream):
మీ చర్మానికి బిబి క్రీమ్ సరిపోతే మీ బ్యాగులో ఈ క్రీమ్ తప్పకుండా ఉంచుకోండి . ఈ బిబి క్రీమ్ అప్లై చేయడం వల్ల మీ ఫేస్ కాంతివంతంగా మారుతుంది.
కాంపాక్ట్(Compact):
అనుకోకుండా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ కాంపాక్ట్ పౌడర్ ను రాసుకొని కూడా ముఖాన్ని కాంతవంతంగా చేసుకోవచ్చు. ముఖంపై బిబి క్రీమ్ రాసిన తర్వాత ఫేస్ పౌడర్ ఉపయోగించడం వలన మీ ముఖం అందంగా ఉంటుంది.
Also Read:Marital sex life : మీ దాంపత్య లైంగిక జీవితానికి బూస్టింగ్ ఇచ్చే పండ్లు ..
లిప్ స్టిక్ (Lip Stick):
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి బ్యాగులో రెండు, మూడు రకాల లిప్ స్టిక్ లను బ్యాగులో ఉండేలా చూసుకోవాలి. మీరు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు లైట్ కలర్ లిప్ స్టిక్ వాడితే మీ బ్యాగులో డార్క్ కలర్ లిప్ స్టిక్ ఉండేలా చూసుకోండి.
వెట్ వైప్స్(Wet Wipes):
మీ ముఖం పైన ఉన్న జిడ్డుని ,మురికిని తొలగించడానికి అలాగే చర్మాన్ని చల్ల పరచడానికి తప్పనిసరిగా మీ బ్యాగ్ లో వెట్ వైప్స్ ఉండేలా చూసుకోవాలి. వీటితో మీ ముఖాన్ని క్లీన్ చేసుకోవచ్చు.
ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళే స్త్రీలు అనుకోకుండా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మీ బ్యాగులో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉండటం వల్ల మీరు నిశ్చింతగా ఉండవచ్చు.