Rain Fall in Telugu States: భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, కర్ణాటకలో తుఫాను వాతావరణం కనిపిస్తుంది. అలాగే మహారాష్ట్ర సమీపంలో మరో తుపాను ఏర్పడింది. ఈరోజు (ఏప్రిల్ 23, 2024) మరియు రేపు కోస్తా ఆంధ్ర మరియు తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం, బీదర్, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ చుట్టూ ఈ ఉదయం జల్లులు పడుతున్నాయి. ఆదిలాబాద్‌లో ఉదయం 9 గంటల తర్వాత జల్లులు ప్రారంభమవుతాయి. ఆసిఫాబాద్‌లో ఉదయం 10 గంటల తర్వాత చిరుజల్లులు పడే అవకాశం ఉంది.. 11 గంటల తర్వాత రామగుండం సమీపంలో జల్లులు కురుస్తాయి.
బీదర్ వైపు నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మేఘాలు కమ్మినట్టు కనిపిస్తాయి. సరిహద్దుల్లో వర్షం కురుస్తుంది. రాత్రి 9 గంటల తర్వాత పశ్చిమ తెలంగాణ, రాయలసీమలను మేఘాలు ఆవరిస్తాయి. ఈరోజు స్వల్పంగా వర్షం కురుస్తుందని వర్షపాత అంచనాలు సూచిస్తున్నాయి. మేఘాలు కూడా తక్కువగా ఉన్నాయి.
బంగాళాఖాతంలో గంటకు 7 నుంచి 15 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తెలంగాణలో గంటకు 10 నుంచి 12 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో గంటకు 12 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రత 36 నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఏపీలో పగటి ఉష్ణోగ్రత 35 నుంచి 42 డిగ్రీల వరకు ఉంటుంది. రాయలసీమ, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఈరోజు ప్రకాశవంతమైన వాతావరణం ఉంటుంది.
ఉత్తర తెలంగాణలో ఈరోజు కొంత తేమ ఉంటుంది. అలాగే కోస్తా ఆంధ్రలో తేమశాతం కూడా ఉంటుంది. ఇతర ప్రదేశాలలో తేమ తక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.
Rain Fall in Telugu States