raithu barosa update 2024: రైతు భరోసా పై బిగ్ అప్డేట్, మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

100 డేస్ ఇన్ ఆఫీస్ మీట్ ది మీడియా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ 100 రోజుల పాలనపై చర్చించారు.

raithu barosa update 2024: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము ఇచ్చిన ఆరు హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. దానిలో భాగంగా ఇప్పటివరకు పలు పథకాలను కూడా అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు పెంపు, తాజాగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ మరియు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ వంటి ఇప్పటికే అమలు అయ్యాయి.

అయితే, హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. అయితే,  100 డేస్ ఇన్ ఆఫీస్ మీట్ ది మీడియా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ 100 రోజుల పాలనపై చర్చించారు. ఇటీవల ప్రవేశపెట్టిన లేదా ప్రారంభించబోతున్న పథకాల గురించి మాట్లాడారు. రైతుభరోసా పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేసినట్టు మాట్లాడారు. మిగిలిన వారికి కూడా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

వీరికి మాత్రమే రైతుభరోసా..

రైతుబంధు స్థానంలో చేపట్టే రైతు భరోసా కార్యక్రమంలో గుట్టలు, చెట్లు, రోడ్డు విస్తరణ వల్ల కోల్పోయిన భూములు, లేఅవుట్‌లు, బంగ్లాలు నిర్మించిన పొలాలు ఉండవని స్పష్టం చేశారు. సాగు భూమి రైతులకు మాత్రమే భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్‌ కోరారు. అలాంటి భూములన్నింటినీ సర్వే చేసి రైతు భరోసా గ్రహీతల జాబితా నుంచి తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏ పథకానికి అయిన దరఖాస్తు చేయండి.. గ్రహీతల జాబితాకు జోడిస్తారు.

రైతుబంధు కార్యక్రమం ద్వారా 68 లక్షల మంది రైతులు ఆర్థిక సహాయం పొందుతున్నారు. అయితే వీరిలో చాలా మంది అనర్హులు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వారందరినీ జాబితా నుంచి తొలగిస్తామని సీఎం ప్రకటించారు. ఇటువంటి లోపాలు రైతు భరోసా సిస్టమ్ ద్వారా చెక్ పెడతాం అని చెప్పుకొచ్చారు.

రెండు విధాతల్లో రైతు భరోసా పంపిణి..

గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రైతు బంధు ఇంకా పంపిణీలో ఉంది. రైతుబంధు ప్రణాళిక కొన్ని మార్గదర్శకాలతో తదుపరి వర్షాకాలం నుండి రైతు భరోసాగా మారుస్తామని తెలిపారు. రైతు భరోసా పథకం కింద ఏటా ఎకరాకు రూ.15 వేలు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. వానాకాలం సీజన్‌కు 7,500, యాసంగి సీజన్‌కు 7,500, మొత్తం 15000 పంపిణీ చేయనున్నారు. వర్షాకాలంలో దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

raithu barosa update

 

 

Comments are closed.