Ration Card Cancellation : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలోని నిరుపేదలకు ఆహారం అందించడానికి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. భారతీయ ప్రజలకు రేషన్ కార్డు తప్పనిసరి చేశారు. ఈ గుర్తింపు కార్డుతో ఎంతో మంది ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారు. ఉచితంగా మరియు చౌక ధరలతో భారతీయ ప్రజలకు ఆహార పదార్దాలు అందుతున్నాయి.
నిరుపేదలకు ప్రతినెలా రేషన్ కార్డుల ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే ఈ రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉంటాయి. అందుకే రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికీ రేషన్ కార్డులు లేకుండా లక్షలాది మంది అనర్హులుగా ఉన్నారు. అయితే, రేషన్ కార్డులు రద్దు కానున్నాయి. కారణం ఏంటంటే..
ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు రేషన్ నుండి ఆహార పదార్ధాలు తీసుకోని రేషన్ కార్డులను రద్దు చేయనున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలో దీనికి సంబంధించిన నిబంధనలను ప్రకటించే అవకాశం ఉంది.
రేషన్ కార్డు హోల్డర్లలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. అదనంగా, పెద్ద మొత్తంలో ఎక్కువ భూమిని కలిగి ఉన్నవారు కూడా రేషన్ కార్డుకు అర్హులుగా ఉన్నారు.దాంతో ప్రభుత్వ పథకాల నుండి లబ్ధి పొందుతున్నారు. రేషన్ కార్డుకి అనర్హులను గుర్తించి వారి రేషన్ కార్డులను రద్దు చేయాలనీ కేంద్రం నిర్ణయించింది. అనర్హత ఉన్నప్పటికీ అక్రమంగా రేషన్ కార్డులు పొందిన వారిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలి నిర్ణయించింది.
మే 1వ తేదీ అనగా ఈరోజు నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. రేషన్‌కార్డు జాబితాలో లేకపోయినప్పటికీ చాలా మంది తమ పేర్లపై రేషన్ తీసుకుంటున్నారు. ఇందు కోసం రేషన్ కేవైసీని కూడా పూర్తి చేయాలి. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం KYC ప్రక్రియ ముగిసింది. దీనితో, KYC పూర్తి చేయలేని వారి పేర్లు వారి రేషన్ కార్డుల నుండి తొలిగిస్తారు.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద చాలా మంది కోవిడ్ నుండి లబ్ది పొందుతున్నారు. రేషన్ కార్డుపై వచ్చే ఉచిత గోధుమలు, పంచదార వంటి ఆహార పదార్దాలు రేషన్ హోల్డర్లకు అందడం లేదని ప్రభుత్వానికి పిర్యాదులు వచ్చాయి. దాంతో, వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని ప్రజా పంపిణీలకు కొత్త విధానాలను తీసుకొస్తుంది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డు అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం.
మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం, ఎన్నికలు ముగిసిన తర్వాత , వీలు అయినంత త్వరగా అర్హులకు రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.