Ration Cards 2024 : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) కోసం అర్హులైన కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును తీసుకుంటుంది. ఏదైనా సామాజిక పథకం నుండి లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డు (White ration card) ఉండాలి. ప్రభుత్వం అన్ని పథకాలకు రేషన్ కార్డుని తప్పనిసరి చేసింది. ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరు చేయాలని అర్హులైన ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 9 లక్షల అదనపు రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం వల్ల వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. రేషన్ కార్డు (Ration Card) ఉంటె పప్పు, గోధుమలు, చెక్కర తక్కువ ధరకే లభిస్తాయి. కానీ, తెలంగాణలో 17,235 మంది వ్యాపారులు ఉండగా, ఒకటో తేదీ నుంచి బియ్యం సరఫరా ప్రారంభం అవుతుంది. అయితే చాలా షాపుల్లో చక్కెర విరివిగా లభించడం లేదు. బియ్యం, గోధుమలు, పంచదార ఇవ్వకుండా పక్క దోవ పట్టిస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
లాక్డౌన్ సమయంలో, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పంపిణీ (Free ration distribution) చేయడం ప్రారంభించింది. కానీ,ఆర్ధికంగా వెనకబడి తమ అవసరాలను కూడా తీర్చుకునే స్థోమత లేని వారి కన్నా ఆర్థికంగా మంచిగ ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వారు ఎక్కువగా దీని ద్వారా ప్రయోజనాలు పొందుతున్నారని వార్తలు వచ్చాయి.
అర్హులు కాని వారు ఈ పథకాన్ని అక్రమంగా వినియోగించుకోవడం చట్ట విరుద్ధం. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆహార శాఖ ద్వారా అలాంటి వారి జాబితాను రూపొందిస్తూ, పథకానికి అనర్హులుగా ప్రకటిస్తోంది.
అందుకే ఈ నిబంధనలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం అర్హత లేకున్నా రేషన్ పొందుతున్న వ్యక్తులు, అక్రమంగా రేషన్‌కార్డులు పొందినవారు, అక్రమంగా రేషన్ దుకాణాల నుండి రేషన్‌లో బియ్యం, గోధుమలు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో జూన్ రెండో వారంలో కొత్త రేషన్‌కార్డులు పొందిన వ్యక్తుల సమాచారాన్ని వెబ్సైటులో పెట్టనున్నట్లు తెలుస్తోంది.