RBI Fine: యాక్సిస్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్‌పై ఆర్బీఐ భారీగా ఫైన్, ఎందుకో తెలుసా ?
ఆర్బీఐ రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు యాక్సిస్ బ్యాంకుపై రూ.90.92 లక్షలు, మణపురం ఫైనాన్స్ సంస్థపై ఆర్బీఐ రూ.42.78 లక్షల జరిమాన విధించింది.
Telugu Mirror: బ్యాంకింగ్ సెక్టార్ రెగ్యులేటర్ యొక్క కొన్ని ఆదేశాలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం యాక్సిస్ బ్యాంక్‌పై రూ.90.92 లక్షలు మరియు గోల్డ్ లోన్ సంస్థ అయినా మణప్పురం ఫైనాన్స్‌పై రూ.42.78 లక్షలు జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (KYC) ఆదేశాలు, రుణాలు అడ్వాన్సులు- చట్టబద్ధమైన ఇతర పరిమితులు, రిస్క్‌లు మరియు ప్రవర్తనా నియమావళి నిర్వహణ మార్గదర్శకాల పై RBI జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు జరిమానా విధించబడింది. బ్యాంక్ ఖాతాదారుల లావాదేవీల నిర్వహణలో రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో యాక్సిస్ బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది.
దీంతో ఈ నెల రెండో తేదీన యాక్సిస్ బ్యాంక్ మీద రూ.90.92 లక్షల పెనాల్టీ విధిస్తున్నట్లు పేర్కొంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ-సిస్టమ్యాటికల్లీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ (systemically important non deposit taking) కంపెనీ (RBI) డైరెక్షన్స్-2016 నిబంధనలను మణపురం ఫైనాన్స్ (Manipuram Finance) పాటించలేదని తేలింది. ఈ విషయం పై తాము జారీ చేసిన నోటీసుకు సంత్రుప్తికరంగా సమాధానం రాకపోవడంతో పెనాల్టీ విధించామని ఆర్బీఐ పేర్కొంది. కేవైసీ నిబంధనల అమలులో విఫలమైనందుకు ఆనంద్ రాథీ గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ (anand rathi financial services ltd mumbai) పై రూ.20 లక్షల పెనాల్టీ విధించింది.
నోటీసుకు ముంబైకి చెందిన ఎన్బిఎఫ్సి (SBFC) సంస్థ ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని మరియు వ్యక్తిగత విచారణ సమయంలో చేసిన మౌఖిక సమర్పణను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఆర్బిఐ నాన్-కాంప్లియన్స్ ఆరోపణ రుజువు చేయబడిందని మరియు ద్రవ్య పెనాల్టీ విధించడాన్ని సమర్థించిందని నిర్ధారించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అసురక్షిత వ్యక్తిగత రుణాలపై నిబంధనలను కఠినతరం చేసింది. రిస్క్ వెయిట్లు 25 శాతం పాయింట్లు పెంచింది దీంతో అసురక్షిత వ్యక్తిగత రుణాలతో సహా వినియోగదారుల క్రెడిట్‌పై రిస్క్ బరువు 100% నుండి 125%కి పెరిగింది. ఈ నిబంధన బ్యాంకులతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు వర్తిస్తుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
Comments are closed.