RCB Vs LSG : బ్యాటింగ్‌తో డికాక్‌ బీభత్సం.. ఆర్‌సీబీకి మరో ఘోర పరాజయం..!

RCB vs LSG

RCB vs LSG : సమష్టి కృషితో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అద్భుతం చేసింది. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో కట్టుదిట్టంగా ఆడిన లక్నో 28 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై (Royal Challengers Bangalore) విజయం సాధించింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని అంశాల్లో దూకుడుగా కనిపించి దీటుగా ఆడిన లక్నో కీలక మ్యాచ్‌ను చేజిక్కించుకుని పాయింట్ల పట్టికలో నెట్‌ రన్‌రేట్‌(Net Runrate) మెరుగుపర్చుకుంది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన బెంగళూరు రెండో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఆరంభమే టాపార్డర్‌ గతి తప్పగా, మిడిలార్డర్‌ కూడా చేతులెత్తేసింది. ఆ సమయంలో వచ్చిన మహిపాల్ లోమ్రోర్ తన శక్తిమేర ప్రయత్నించినా బెంగళూరుకు నిరాశ తప్పలేదు.

15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ని ఓడించింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో (M Chinnaswamy Stadium) ఆర్సీబీ ఘోర ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంలో సొంతగడ్డపై ఆ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. మరోవైపు లక్నో జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. 3 మ్యాచ్‌ల్లో ల‌క్నోకు 4 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు ఆర్సీబీ 4 మ్యాచ్‌ల్లో ఒక‌టి గెలిచి 2 పాయింట్లు తో ఉంది. ఆ జట్టు ఇప్పటికీ తొమ్మిదో స్థానంలోనే ఉంది. చివ‌ర‌లో ముంబై ఇండియ‌న్స్ ఉంది.

RCB vs LSG

ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf Duplessis) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ జట్టు 19.4 ఓవర్లలో 153 పరుగులకే కుప్ప‌కూలింది. క్వింట‌న్ డికాక్ బ్యాటింగ్ విధ్వంసం, నికోల‌స్ పూర‌న్ హిట్టింగ్ సునామీతో బెంగ‌ళూరు బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నారు. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించారు. డికాక్ 81 ప‌రుగులు, పూర‌న్ 40 ప‌రుగుల కీల‌క ఇన్నింగ్స్ ఆడారు.

182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఏ ఒక్క ప్లేయ‌రు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లోమ్రోర్ 33 పరుగుల‌తో ఆర్సీబీ త‌ర‌ఫున టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. రజత్ పాటిదార్ 29 పరుగులు, విరాట్ కోహ్లీ (Virat Kohli) 22 పరుగులు చేశారు. ఫాఫ్ డుప్లెసిస్ 19, మహ్మద్ సిరాజ్ 12, అనుజ్ రావత్ 11 పరుగులు చేశారు. 9 పరుగుల వద్ద కామెరాన్ గ్రీన్ ఔట్ కాగా, 4 పరుగుల వద్ద దినేష్ కార్తీక్ ఔటయ్యాడు. గ్లెన్ మాక్స్‌వెల్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.

RCB vs LSG

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in