Telugu Mirror : Realme స్మార్ట్ ఫోన్ కంపెనీ తన C సిరీస్ లో భాగంగా భారత దేశంలో బడ్జెట్ ఫోన్ Realme C53 ని విడుదల చేసింది.5000mAh బ్యాటరీని కలిగి ఉండి 108MP ప్రైమరీ కెమెరా బోట్ వెనుకభాగంలో కలిగిఉన్న ఈ హ్యాండ్ సెట్ ప్రారంభ ధర రూ.9,999 మాత్రమే.
ToDay Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈరోజు గురువారం , జూలై 20, 2023 తిథి ,పంచాంగం
Realme C53 ఫీచర్ లు:
Realme C53 డివైజ్ 6.74-అంగుళాల 90Hz డిస్ ప్లే ని కలిగి 90.3% స్క్రీన్ -టు-బాడీ రేషియోతో 560nits గరిష్ఠ బ్రైట్ నెస్ ని కలిగి ఉంటుంది.పరికరం యొక్క స్క్రీన్ టచ్ నమూనా 180Hz రేట్ తో ఉంటుంది. ఈ డివైజ్ ARM Mali-G57 GPU అలాగే 12nm ఆక్టా-కోర్ చిప్ సెట్ నుండి 1.82GHz CPU అందించబడుతుంది.Realme C53 స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.ఇవి 1080P/30fps ,720P/30fps అలానే 480P/30fps వరకు వీడియో రికార్డింగ్ మద్దతు కలిగి ఉండి108MP అల్ట్రా క్లియర్ కెమెరాతో సెట్ చేయబడినది.
Realme C53 ఫోన్ లో సెల్ఫీలు వీడియో కాల్ ల కోసం,8MP AI సెల్ఫీ కెమెరాతో వస్తుంది.720P/30fps ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ కు మద్దతు కలిగి ఉంటుంది. పోర్ట్రైయిట్ మోడ్, బ్యూటీ మోడ్, బోకే ఎఫెక్ట్ కంట్రోల్, హెచ్ డి ఆర్,ఫేస్- రికగ్నిషన్ వంటి కెమెరా ఫీచర్ లను కూడా కలిగి ఉంది.
Realme C53 5000mAh బ్యాటరీని కలిగి ఉండి 18W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.రెండు నానో కార్డ్ స్లాట్ లు,మైక్రో SD స్లాట్ కలిగి ఉంది ఈ పరికరం.2.4/5GHz,3.5mm హెడ్ సెట్ జాక్, USB టైప్-C ,బ్లూ టూత్ మరియు ఇతర కనెక్టివిటీ లను కలిగి ఉంటుంది.
Sukanya Samrudhi : కేవలం 250 రూపాయలతో డిపాజిట్, మీ చిన్నారి భవిష్యత్ కోసం అదిరిపోయే స్కీమ్
Realme C53 ధర మరియు కలర్స్:
Realme C53 రెండు వేరియంట్ లను కలిగి ఉంది.4GB RAM తో 128GB స్టోరేజ్, 6GB RAM + 64GB నిల్వ సామర్ధ్యం కలిగి ఉంటాయి.4GB +128GB డివైజ్ ధర రూ.9,999 లు,6GB +64GB హ్యాండ్ సెట్ ధర రూ.10,999.Realme C53 ఛాంపియన్ గోల్డ్ మరియు ఛాంపియన్ బ్లాక్ రంగులలో లభిస్తుంది.
Realme C53 లభ్యత:
Realme C53 భారత దేశంలో Realme India వెబ్ సైట్ లోనూ, ఇ-కామర్స్ దిగ్గజం Flipkaart లో మరియు ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్ లలో కొనుగోలు చేయవచ్చు.Realme C53 ఇండియాలో జూలై 26 మధ్యహానం 12 గంటలనుండి విక్రయించబడుతుంది.ఫోన్ పరిచయ ఆఫర్ క్రింద రూ.1,000 తగ్గింపు పై వినియోగదారులు ఈ హ్యాండ్ సెట్ ను పొందవచ్చు.