Telugu Mirror: స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Realme తన కొత్త సరసమైన Realme C51 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ పరికరం 90Hz రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉండి,6.74-అంగుళాల HD డిస్‌ప్లేతో వస్తుంది. Unisoc T612 SoC చిప్ సెట్ మరియు డ్యూయల్ రియర్ కెమెరాలు (50MP ప్రైమరీ), 8MP సెల్ఫీ కెమెరాలు అమర్చబడి ఉంటాయి. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో మరియు ఆండ్రాయిడ్ 13తో రన్ చేస్తుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసుకున్న బ్యాంక్ కార్డ్‌ల మీద రూ. 500 తగ్గింపు అందిస్తుంది. ఈ నూతన డివైజ్ సెప్టెంబర్ 4 నుండి కంపెనీ అధికారిక వెబ్ సైట్ Realme.com, Flipkart మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
Realme C51: భారతదేశంలో ధర
Realme C51 ధర భారతదేశంలో రూ. 8,999, మరియు ఇది 4GB RAM మరియు 64GB స్టోరేజ్ కెపాసిటీతో ఒకే ప్యాట్రన్ లో అందుబాటులో ఉంది. Realme C51 రెండు కలర్ ఆప్షన్ లలో వస్తుంది , కార్బన్ బ్లాక్ (Carbon Black) మరియు మింట్ గ్రీన్ (Mint Green). Realme C51సెప్టెంబర్ 4, సాయంత్రం 6 గంటల నుండి కోనుగోలు దారులకు అందుబాటులో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Realme.com, Flipkart మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా ఖరీదు చేయవచ్చు.
Realme C51 ఓపెనింగ్ ఆఫర్ లో భాగంగా HDFC, SBI, ICICI, Axis లేదా Kotak బ్యాంక్ కార్డ్ లతో కొనుగోలు చేసినప్పుడు Realme C51పై రూ.500 తగ్గింపులో లభిస్తుంది.
Realme C51: స్పెసిఫికేషన్‌లు
Realme C51, లైనప్‌కి నూతన జోడింపు 6.74-అంగుళాల HD (720 x 1,600) డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది 560 నిట్‌ల అత్యధిక ప్రకాశాన్ని అందిస్తుంది. ఆక్టా-కోర్ యునిసోక్ T612 SoC ద్వారా పరికరం శక్తి వంతం గా మారుతుంది. 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడి ఉంటుంది. టెక్నికల్ గా ఇది RAM ఎక్స్పాండ్ ని కలిగి ఉంటుంది. 4GB వరకు వర్చువల్ RAM కోసం ఆప్షన్ అందిస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ Realme C51 Android 13లో రన్ అవుతుంది.
Realme C51 డ్యూయల్ రియర్ కెమెరా సెట్టింగ్ తో వస్తుంది, ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా f/1.8 ఎపర్చర్‌తో పాటు సెకండరీ సెన్సార్‌తో ఉంటుంది. ఫ్రంట్ భాగంలో, ఇది f/2.0 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది, ఇది సెల్ఫీలు మరియు వీడియో కాల్‌లకు అనువైనది. అదేవిధంగా
Realme C51 5,000mAh బ్యాటరీని కలిగి ఉండి 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ ను అందిస్తుంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీ మరియు 3-కార్డ్ స్లాట్ మొదలగు కనెక్టివిటీ లను కలిగి ఉంటుంది. Realme C51 కొలతల పరంగా 7.99 మిమీ మందంతో స్లిమ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది మరియు ఈ పరికరం బరువు 186 గ్రా.