Realme Narzo N65 5G : క్రేజీ లుక్ తో రియల్ మీ నుండి సరికొత్త ఫోన్, సరసమైన ధరకే అదిరే ఫీచర్లు.
రియల్ మీ నుండి మరో కొత్త 5జీ ఫోన్ వచ్చింది. తక్కువ ధరకే ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Realme Narzo N65 5G : ప్రస్తుత, మార్కెట్లో 5జీ ఫోన్ల ట్రెండ్ నడుస్తుంది. స్మార్ట్ ఫోన్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సరికొత్త ఫోన్లతో అద్భుతమైన స్మార్ట్ ఫీచర్లతో ప్రజలు ముందుకు వస్తున్నాయి. కస్టమర్లు కూడా కొత్తదనానికి అలవాటు పడి, విపరీతంగా ఫోన్లను కొంటున్నారు. 5G ఫోన్లను కొనుగోలు చేస్తూ ఆన్లిమిటెడ్ డేటాను పొందుతున్నారు. కంపెనీలు కూడా 5G ఫోనులనే ఎక్కువగా ప్రవేశపెడుతున్నాయి. అయితే, రియల్ మీ నుండి మరో కొత్త 5జీ ఫోన్ వచ్చింది.
తక్కువ ధరకే ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. Realme నార్జో సిరీస్ లో ఇది లాంచ్ అయింది. Realme నార్జో N65 5G పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ ఫోన్ ధర రూ. 11,499 ఉండవచ్చు. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్షనల్ 6300 చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియేషన్లలో వస్తుంది. రియల్ మీ నార్జో ఎన్65 5G ఫోన్ యొక్క ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు ఇప్పుడు చూద్దాం.
రెండు మోడళ్లు ఉన్నాయి …
Realme Narzo N65 5G రెండు మోడళ్లలో అందుబాటులో ఉంది. 4GB RAM, 128GB స్టోరేజ్ కలిగింది దీని ధర రూ.11,499 కాగా , 6GB RAM, 128GB స్టోరేజ్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499 ఉంది.
ఎప్పటి నుంచి సేల్ ప్రారంభం అవుతుంది?
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. మొదటి సేల్ మే 31, 2024న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. మొదటి ఆఫర్ కింద, 4GB వేరియంట్ ధర రూ. 10,499, అయితే 6GB వేరియంట్ ధర రూ. 11,499 ఉంది. ఈ ప్రమోషన్ జూన్ 4 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మరి కెమెరా సంగతి ఏంటి?
ఈ స్మార్ట్‌ఫోన్‌లో అప్డేటెడ్ మినీ క్యాప్సూల్స్ 2.0 మరియు AA డైనమిక్ పవర్ బటన్ ఉంటుంది. ఇది సౌండ్ మోడ్‌ని ఎనేబుల్ లేదా డిజేబుల్ చేసుకోవచ్చు , ఇంకా డునాట్ డిస్టర్బ్ మోడ్, రైడింగ్ మోడ్ మరియు ఫ్లయింగ్ మోడ్‌ని కంట్రోల్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
Realme Narzo N65 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల HD ప్లస్ డిస్ప్లేను స్క్రీన్-టు-బాడీ రేషియో తో 89 శాతం కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 625 నిట్ల ప్రకాశాన్ని కలిగి ఉంది. డివైజ్ లో 50MP బ్యాక్ కెమెరా మరియు 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీ 5000 mAhని కలిగి ఉంది. 15W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ ను ఇస్తుంది.
Comments are closed.