Telugu Mirror: Realme ప్యాడ్ 2 ఇప్పుడు భారతదేశంలో లభిస్తుంది. MediaTek హీలియో G99 CPU సపోర్ట్ చేసే ఈ టాబ్లెట్ 11.5 అంగుళాల 2K డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. ఈ డివైస్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్లలో 8MP రియర్ కెమెరా మరియు కనీస బెజెల్స్ ఉన్నాయి. Realme C53 తోపాటుగా ఈ ట్యాబ్లెట్ ను ఇండియాలో ఆవిష్కరించారు.
Realme ప్యాడ్ 2, 11.5-అంగుళాల 2K IPS LCD డిస్ ప్లేను కలిగి ఉంది. ప్యాడ్ 2 రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్, స్క్రీన్ టు బాడీ రేషియో 82.5 శాతం. ఇది టాబ్లెట్ యొక్క బెజెల్స్ చాలా సన్నగా ఉన్నాయని సూచిస్తుంది. 450nits పీక్ బ్రైట్నెస్, మెరుగైన ఇమేజ్ క్వాలిటీ కోసం ఓ1 అల్ట్రా విజన్ ప్రాసెసర్ ఈ టాబ్లెట్ ప్రత్యేకతలు.
MediaTek హీలియో G99 SoC ప్రాసెసర్ తో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్ కు Mali – G57 MC2ను జత చేశారు. పరికరం యొక్క RAM 8GB వరకు, మరియు టాబ్లెట్ 256GB నిల్వ సామర్థ్యం ఉంది. బాహ్య నిల్వ కార్డు (మైక్రో SD) నిల్వ స్థలాన్ని విస్తరించడానికి ఉపయోగించవచ్చు. Realme ప్యాడ్ 2 ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది.
Also Read: Nothing Phone(2) : భారత్ లోకి భారీ అంచనాల నడుమ నథింగ్ ఫోన్ (2)..
ఇక కెమెరాల విషయానికి వస్తే.. గ్యాడ్జెట్ వెనుక, ముందు రెండు వైపులా 8MP కెమెరాను అమర్చారు. బ్యాటరీ సామర్థ్యం(Battery Capacity)8360 mAh కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్(Fast Charging)కి సపోర్ట్ చేస్తుంది. Realme ప్యాడ్ 2లో 4G LTE, వై-ఫై 802.11AC , బ్లూటూత్ 5.3, USB టైప్-C ఛార్జింగ్ కనెక్టర్ ఉన్నాయి.
రకాలు మరియు అమ్మకాలు:
రియల్మి ప్యాడ్ 26GB RAM + 128GB ధర రూ. 19,999.
8GB RAM + 256 GB మోడల్ ధర రూ. 22,999.
Also Read:SVS : స్మార్ట్ ఫోన్ తో కళ్లకు కష్టకాలం.. స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ అసలు కారణమా?
ఈ టాబ్లెట్ ను జూలై 26 నుంచి 31 వరకు రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రీ-బుక్ చేసుకున్న కస్టమర్లు రూ. 2,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart , Realme వెబ్ సైట్, ఫిజికల్ స్టోర్ల ద్వారా తొలిసారిగా ఈ టాబ్లెట్ ను విక్రయించనున్నారు. కలర్ పరంగా గ్రే, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…