Redmi Note13 R Launch: రెడ్‌మి నోట్ 13ఆర్ స్మార్ట్‌ఫోన్‌కు ఇప్పుడు చైనా (China) లో లాంచ్ అయింది. ఈ ఫోన్, 6.79 అంగుళాల హెచ్డి + డిస్ప్లే (HD+Display) ను కలిగి ఉంది. రెడీమి నోట్ 12ఆర్ తర్వాత ఈ కొత్త వర్షన్ చైనా (China) లో లాంచ్ అయింది. Redmi Note 13R మూడు రంగుల్లో మరియు ఐదు డిజైన్లతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ రన్ అవుతుంది. ఫోన్ బ్యాక్ సైడ్ హైపర్ ఓఎస్ (Hyper OS) మరియు 50-మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 5,030 mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు దీనిని 33Wతో త్వరగా ఛార్జ్ చేయవచ్చు.
Redmi Note 13R ఫీచర్లు :
షావోమి (Xiaomi) యొక్క హైపర్ ఓఎస్ రన్నింగ్ సిస్టమ్ తో Redmi Note 13R రన్ అవుతుంది. ఇది 6.79 అంగుళాల HD+ డిస్ప్లే ను కలిగి ఉంది. ఇంకా, 120 Hz స్క్రీన్ ఫ్రేమ్ రేట్, 550 nits పీక్ బ్రైట్‌నెస్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. 12 GB RAM మరియు 512 GB వరకు ఇది అందుబాటులో ఉంది.
కెమెరా విషయానికి వస్తే, ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉంటాయి. ఒకటి 50 మెగాపిక్సెల్ (50 Megapixel) లు ఇంకోటి 2 మెగాపిక్సెల్‌లతో వస్తాయి. ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరా 8-మెగాపిక్సెల్స్ ని కలిగి ఉంది.
ఈ ఫోన్‌లో బ్లూటూత్, గ్లోనాస్, గెలీలియో, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-C పోర్ట్, ఇతర డివైజ్ లకు కనెక్ట్ చేయడానికి వైఫై మరియు జీపీఎస్ ఆప్షన్ లు కూడా ఉన్నాయి. ఇ-కంపాస్, డిస్టెన్స్ మానిటర్, వర్చువల్ గైరోస్కోప్, యాక్సిలరోమీటర్ మరియు ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఉన్నాయి. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ (Finger Print Sensor) ఫోన్ పక్కభాగంలో ఉంటుంది. దీని వెడల్పు 0.83 సెం.మీ ఉండగా.. బరువు 205 గ్రాములు ఉంది.
Also Read: Mobile Data Saver: మీ మొబైల్ డేటా వెంటనే అయిపోతుందా? అయితే, ఇలా చేయండి మరి!
Redmi Note 13R ధర విషయానికి వస్తే..
చైనాలో, ఈ ఫోన్ ఐదు డిజైన్లతో వస్తుంది. 6 GB RAM మరియు 128 GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ.16,000 ఉంది. 8GB RAM మరియు 128GB స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర రూ.19,000 ఉంది. 8GB RAM మరియు 256GB స్టోరేజ్ కలిగి ఉన్న ఫోన్ ధర రూ. 21,000 ఉంది. 12GB RAM మరియు 256GB స్టోరేజ్ కలిగి ఉంటే ఆ ఫోన్ ధర రూ.23,000 ఉంది. 12 GB RAM మరియు 256 GB స్టోరేజ్ తో టాప్ మోడల్‌ని పొందాలంటే రూ. 25,000 చెల్లించాలి. ఐస్ క్రిస్టల్ సిల్వర్, లైట్ సీ బ్లూ మరియు మిడ్‌నైట్ డార్క్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అయితే, మరి ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.