Telugu Mirror: కొంత మంది తరచూ మూత్ర విసర్జన చేస్తుంటారు.మరి కొందరికి మూత్రంలో రక్తం వస్తుంది.ఇలా జరగటానికి కారణం మూత్రాశయం లో ఇన్ఫెక్షన్ కలిగి ఉండటం.దీనినే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్(UTI) అని కూడా అంటారు.ఇది మూత్ర పిండాలు(Kidneys),మూత్ర నాళాలు లేదా మూత్రాశయంతో సహా మూత్ర వ్యవస్థ యొక్క అవయవాలలో ఏర్పడుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా మరియు వైరస్(Virus) లేదా శిలీంధ్రాల వంటి వ్యాధికారకాలు మూత్ర వ్యవస్థ యొక్క అవయవాలలో పెరుగుట వలన ఇన్ఫెక్షన్ ఎక్కువగా సంభవిస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఏ వయస్సు ఉన్న వారికైనా వస్తుంది.అలాగే స్త్రీ,పురుషులలో ఇన్ఫెక్షన్ వస్తుంది.కానీ స్త్రీలలో ఈ సమస్య కొంచం అధికం. UTI అనగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇవి రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది దిగువ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్,రెండవది ఎగువ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ గా సూచిస్తారు. దిగువ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ మూత్ర నాళాలు మరియు మూత్రా శయం లో సోకుతాయి. ఎగువ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వలన మూత్రపిండాలు ప్రభావితం అవుతాయి. మూత్రం పోసేప్పుడు మంట కలగటం కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లక్షణాలే. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యకు తక్షణం వైద్య చికిత్స అవసరం.అయితే ఈ ఇన్ఫెక్షన్ లు ప్రారంభ దశలో ఉంటే వాటిని సహజ పద్దతిలో నివారించే ప్రయత్నం చేయవచ్చని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ కొన్ని చిట్కాలను సూచించారు.
Also Read:Vitamin-D : వర్షాకాలంలో విటమిన్-డి ..ఇవి తినక తప్పదుగా మరి..
•మూత్రంలో మంట ఉన్న వారు ప్రతి రెండు గంటలకు చెర్రీస్ ని తీసుకోవడం వలన ఉపశమనం కలుగుతుంది.
•వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.యూరిన్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు పచ్చి వెల్లుల్లి రెబ్బలు సుమారు 4-5 తీసుకుంటే అది ఇన్ఫెక్షన్ లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.
•నీరు(Drinking Water) పుష్కలంగా తాగుతుంటే టాక్సిన్ లను కరిగించి,వాటిని సిస్టమ్ నుండి బయటకు రిలీజ్ చేస్తుంది.నీరు ఎక్కువగా తాగడం వలన ఇన్ఫెక్షన్ తిరగ బెట్టకుండా నిరోధిచడంలో సహాయం చేస్తుంది.
Also Read:Foot care: వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మీ పాదాలను సంరక్షించుకోండిలా…
•ఆల్కహాల్(Alcohol) డీ హైడ్రేషన్(De Hydration) ను పెంచుతుంది,మూత్రాశయం ఇన్ఫెక్షన్లను పెంచేందుకు దోహదం చేస్తుంది.కనుక ఆల్కహాల్ తీసుకోవడాన్ని నివారించాలి.
•మూత్రాశయ ఇన్ఫెక్షన్ లు కలిగినప్పుడు ప్రొటీన్(Protein)లను వాడరాదు.తీసుకునే ఆహారం లో పండ్లు(Fruits),కూరగాయలను(Vegetables) అధికంగా తీసుకోవాలి.
•మూత్రాశయ ఇన్ఫెక్షన్ లకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమ్మ తొక్క అలానే దాల్చినచెక్కతో చేసిన హెర్బల్ టీ(Herbal Tea) సహాయ కారిగా ఉంటాయి.
ఈ సహజ రెమిడీలను పాటించి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లనుండి ఉపశమనం పొందండి.మరియు మీ వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్సను పొందండి.